Site icon HashtagU Telugu

Airtel IPTV : ఎయిర్‌టెల్‌ ఐపీటీవీ.. ఏమిటిది ? అన్ని ఫీచర్లా ?

Airtel Iptv Services Iptv Plans Indian Cities

Airtel IPTV : ఐపీటీవీ అంటే ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ టెలివిజన్‌.  ఇంటర్నెట్‌ ద్వారా టీవీ ఛానళ్లను చూసే సౌకర్యాన్ని ఐపీటీవీ కల్పిస్తుంది. కేబుల్‌ టీవీ, డీటీహెచ్‌లకు ప్రత్యామ్నాయంగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.  వైఫై, ఓటీటీ, టీవీ ఛానళ్ల సర్వీసులను కలిపేసి  ఐపీటీవీ సర్వీసును అందిస్తారు. తమ ఐపీటీవీ సేవలను దేశంలోని 2వేల నగరాలకు విస్తరించామని ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. త్వరలో ఢిల్లీ, రాజస్థాన్‌, అసోం, పలు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సేవలను తీసుకొస్తామని తెలిపింది. ఇందులో భాగంగా వైఫై సర్వీసులతో పాటు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, యాపిల్‌ టీవీ+, సోనీలివ్‌, జీ5 వంటి ఓటీటీ యాప్స్‌తో పాటు 600 టీవీ ఛానళ్లను అందిస్తామని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. ఈ ప్లాన్లు రూ.699 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌లో కనెక్షన్‌ బుక్‌ చేసుకునే వారికి ప్రారంభ ఆఫర్‌ కింద 30 రోజుల పాటు ఉచితం సర్వీసులు ఇస్తామని చెప్పింది.

Also Read :Bank Account Nominees : ఇక ఖాతాకు నలుగురు నామినీలు.. ‘బ్యాంకింగ్’ బిల్లుకు ఆమోదం

ఐపీటీవీ ప్లాన్లు

Also Read :Telangana New Ministers : తెలంగాణ కొత్త మంత్రులు వీరే..శాఖలు ఇవే !

ఐపీటీవీ ప్రయోజనాలివీ..