Airtel – Tata Play : డిజిటల్ టీవీ విభాగంలో జియోను ఢీకొనేందుకు ఎయిర్‌టెల్ రెడీ అవుతోంది. ఇందుకోసం టాటా గ్రూప్‌కు చెందిన డైరెక్ట్ టు హోం (డీటీహెచ్) సేవల కంపెనీ టాటా ప్లేను కొనేందుకు రెడీ అవుతోంది. టాటా ప్లేను కొంటే తమ డిజిటల్ టీవీ వ్యాపారం మరింత బలోపేతం అవుతుందని ఎయిర్‌టెల్ భావిస్తోంది. ఓవర్ ది టాప్ (OTT) విభాగంలో తమకు పట్టు పెరిగేందుకు టాటా ప్లే దోహదపడుతుందని యోచిస్తోంది. ఒకవేళ టాటా ప్లేను ఎయిర్‌టెల్ కొంటే.. సబ్ స్కేల్ కంటెంట్, వినోద కార్యకలాపాల విభాగం నుంచి టాటా ప్లే (Airtel – Tata Play) వైదొలగాల్సి ఉంటుందని తెలుస్తోంది. 2017లో టాటా కన్జ్యూమర్ మొబిలిటీ వ్యాపారాన్ని ఎయిర్‌టెల్ కొనేసింది. ఇప్పుడు ఇరు సంస్థల మధ్య రెండో అతిపెద్ద డీల్ కుదిరే దిశగా అడుగులు పడుతున్నాయి.
Also Read :PM Modi – Israel : మోడీ రావాలి.. యుద్ధం ఆపాలి.. ఇజ్రాయెల్ మాజీ పీఎం కీలక వ్యాఖ్యలు
- డీటీహెచ్ విభాగంలో టాటా ప్లేకు 2.70 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. భారత డీటీహెచ్ మార్కెట్‌లో 32.7 శాతం వాటాతో టాటా ప్లే చేతిలోనే ఉంది.
- 2023-2024 ఆర్థిక సంవత్సరంలో టాటా ప్లేకు రూ.353.8 కోట్ల ఏకీకృత నికర నష్టం వచ్చింది.
- ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కూడా నష్టాల బాటలోనే ఉంది. అయితే సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరగడం అనేది ఆ కంపెనీకి ప్లస్ పాయింట్.
- డీటీహెచ్ మార్కెట్‌లో ఎయిర్‌టెల్‌కు 27.8 శాతం వాటా ఉంది.
- టాటా ప్లేను కొంటే ఎయిర్‌టెల్ కస్టమర్ బేస్ భారీగా పెరగనుంది. జియోతో పోటీపడే సత్తా ఎయిర్‌టెల్‌కు లభిస్తుంది.
- ప్రస్తుతం మన దేశంలోని టైర్-1, టైర్-2 నగరాల్లో ప్రజలు డీటీహెచ్‌కు బదులుగా హోం బ్రాడ్‌బ్యాండ్‌లో ఓటీటీ ప్యాక్‌లను సబ్‌స్క్రయిబ్ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
- మన దేశంలోని గ్రామీణ చందాదారులు ఎక్కువగా దూరదర్శన్‌కు చెందిన ఫ్రీ డిష్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.