Air India VRS: ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ విలీన ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈ రెండు విమానయాన సంస్థల విలీనం ఈ ఏడాది పూర్తి కానుంది. ఈ రెండు ఎయిర్‌లైన్స్‌లో దాదాపు 18 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 500 నుంచి 600 మంది ఉద్యోగులు ఈ విలీనానికి బాధితులు కానున్నారు. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఈ ఉద్యోగుల కోసం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (Air India VRS) ప్రారంభించింది. వీరంతా పర్మినెంట్ గ్రౌండ్ స్టాఫ్‌లో భాగమే.
విస్తారా, ఎయిర్ ఇండియా ఈ ఏడాది విలీనం కానున్నాయి
టాటా గ్రూప్- సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ అయిన విస్తారా ఎయిర్‌లైన్స్ ఈ ఏడాది చివరి నాటికి ఎయిర్ ఇండియాలో విలీనం కానుంది. విలీనం తర్వాత అంతగా గ్రౌండ్ స్టాఫ్ అవసరం ఉండదని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు బిజినెస్ స్టాండర్డ్ కు తెలిపారు. అందుకోసం గ్రౌండ్ స్టాఫ్ కు వీఆర్ఎస్ ఇస్తున్నారు.
Also Read: Encounter : భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల హతం
ఉద్యోగులు VRS, VSS తీసుకోగలరు
ఎయిర్ ఇండియాలో కనీసం 5 సంవత్సరాల సర్వీసు ఉన్న ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (VRS), 5 కంటే తక్కువ ఉన్న ఉద్యోగుల కోసం వాలంటరీ సెపరేషన్ స్కీమ్ (VSS) అందిస్తున్నామని ఎయిర్ ఇండియా గ్రౌండ్ సిబ్బందికి పంపిన సందేశంలో తెలిపింది. ఈ విషయంపై ఎయిర్ ఇండియా ఇంకా స్పందించలేదు. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది మినహా శాశ్వత గ్రౌండ్ స్టాఫ్ అందరూ ఈ పథకాల ప్రయోజనాలను పొందవచ్చని ఎయిర్ ఇండియా తన సందేశంలో పేర్కొంది. రెండు పథకాల ప్రయోజనాలను ఆగస్టు 16 వరకు పొందవచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
AIX కనెక్ట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా విలీనం
రెండు విమానయాన సంస్థలు వీలైనంత ఎక్కువ మందిని నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొంతమంది ఉద్యోగులకు టాటా గ్రూప్‌లోని ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చారు. అయితే విలీనం కారణంగా కొన్ని పోస్టులు అవసరం లేదు. దీనితో పాటు ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ AIX కనెక్ట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ల విలీనం కూడా జరుగుతోంది. ఈ రెండూ కలిసి భారీ బడ్జెట్ ఎయిర్‌లైన్‌గా మారనున్నాయి.