Adani Group Stocks: ఈరోజు అంటే శుక్రవారం భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో భారీ జంప్ కనిపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1700 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్లు పెరిగాయి. BSE సెన్సెక్స్ 78,000 పైన, నిఫ్టీ 50 23,600 పైన కొనసాగింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బిఎస్‌ఇ సెన్సెక్స్ 866 పాయింట్లు లేదా 1.12% పెరిగి 78,021.78 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 271 పాయింట్లు లేదా 1.16% పెరుగుదలతో 23,620.60 వద్ద ట్రేడయ్యాయి భారతీయ ఈక్విటీ ఇండెక్స్ ఐదు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత శుక్రవారం మెరుగుపడింది. స్టాక్ మార్కెట్లతో పాటు అదానీ గ్రూప్ షేర్లు (Adani Group Stocks) కూడా 6 శాతం పెరగడం గమనార్హం.
మధ్యాహ్నం 2:16 గంటలకు, BSE సెన్సెక్స్ 1,692 పాయింట్లు లేదా 2.19% పెరిగి 78,848.06 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50,513 పాయింట్లు లేదా 2.20% పెరిగి 23,862.70 వద్ద ఉంది. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల సామూహిక మార్కెట్ విలువ రూ.6.9 లక్షల కోట్లు పెరిగి రూ.432.25 లక్షల కోట్లకు చేరుకుందని మీడియా నివేదికలు తెలిపాయి.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీని అత్యధిక సార్లు అవుట్ చేసిన 5 మంది బౌలర్లు వీరే!
ఈ రంగాల షేర్లలో పెరుగుదల
సెన్సెక్స్ పెరుగుదలలో కీలక పాత్ర పోషించిన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎల్ అండ్ టీ ఉన్నాయి. TCS, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ నుండి కూడా అదనపు మద్దతు లభించింది. నిఫ్టీ PSU బ్యాంక్, రియల్టీ దాదాపు 3% లాభపడ్డాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసిజి, ఐటి, మెటల్, హెల్త్ కేర్, ఆయిల్ & గ్యాస్ సహా ఇతర రంగాలు 1-2% మధ్య లాభాలను నమోదు చేశాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 చొప్పున పెరిగాయి
బలమైన US ఉపాధి డేటా ప్రభావంతో నిఫ్టీ IT దాదాపు 2% లాభపడింది. నవంబర్ 16తో ముగిసిన వారంలో USలో జాబ్‌లెస్ క్లెయిమ్‌లు 6,000 తగ్గి 2,13,000కి పడిపోయి ఏడు నెలల కనిష్టానికి చేరాయి. అక్టోబర్‌లో క్షీణత తర్వాత నవంబర్‌లో ఉపాధి మెరుగుదలని ఇది సూచిస్తుంది. దీనితో పాటు అదానీ గ్రూప్ షేర్లు కూడా 6% పెరిగాయి. అంబుజా సిమెంట్ 6% లాభపడగా, ACC 4% పెరిగింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 2.5% పెరుగుదల నమోదైంది. దీనితో పాటు గ్రూప్‌లోని ఇతర కంపెనీలు కూడా 1-2% పెరుగుదలను నమోదు చేశాయి.
పెట్టుబడిదారులు ఇటీవలి మార్కెట్ కరెక్షన్‌ను సద్వినియోగం చేసుకున్నారు. నిఫ్టీ గరిష్ట స్థాయి నుండి 11% కంటే ఎక్కువ పడిపోయింది. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు వరుసగా సుమారు 12- 9% మెరుగుపడ్డాయి. దీంతో పాటు ఆసియా మార్కెట్లలో సానుకూల మార్పులు కనిపించాయి.