Adani AGM 2024: అదానీ సంస్థ పిల్లర్ ని కూడా కడపలేరు: గౌతమ్ అదానీ

ప్రతికూల పరిస్థితులు మమ్మల్ని పరీక్షించాయని, మునుపటి కంటే మమ్మల్ని బలోపేతం చేశాయని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. అలాగే అదానీ సంస్థ పునాదిని ఎవరూ కదపలేరని విశ్వాసం వ్యక్తం చేశారు గౌతమ్ అదానీ.

Adani AGM 2024: ప్రతికూల పరిస్థితులు మమ్మల్ని పరీక్షించాయని, మునుపటి కంటే మమ్మల్ని బలోపేతం చేశాయని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. అలాగే అదానీ సంస్థ పునాదిని ఎవరూ కదపలేరని విశ్వాసం వ్యక్తం చేశారు గౌతమ్ అదానీ. ఈ రోజు అదానీ ఎంటర్‌ప్రైజెస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. కొందరు విదేశీయులు తనపై నిరాధార ఆరోపణలు చేశారని, తన దశాబ్దాల కృషిపై ప్రశ్నలు లేవనెత్తారని గుర్తు చేశారు. మా సంస్థ ప్రతిష్టపై జరిగిన ఆకస్మిక దాడికి మేము విజయవంతంగా స్పందించాము. మా గ్రూప్‌ పునాదిని ఏ సవాళ్లూ కదిలించలేవని నిరూపించామని అన్నారు. సాధారణంగా కొందరు ఫైనాన్షియల్ మార్కెట్ల వ్యక్తులు తమ లాభం కోసం ఇలాంటి విమర్శలు చేస్తారని తెలిపారు.

మాపై రెండు వైపుల నుంచి దాడులు జరిగాయని గౌతమ్ అదానీ అన్నారు. ఒకవైపు మా ఆర్థిక పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ సమయంలో తప్పుడు సమాచారంతో మాపై ప్రచారం చేసి రాజకీయాల్లోకి లాగారు. ఈ దాడి పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరిగింది మరియు మా ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ ముగింపుకు రెండు రోజుల ముందు జరిగిందని చెప్పారు. ఆ సంస్థ పరువు తీయడానికి, సంస్థకు నష్టాన్ని కలిగించడానికి ఈ అసత్య ప్రచారం చేసినట్లు చెప్పారు గౌతమ్ అదానీ.

భారత అత్యున్నత న్యాయస్థానం ఆరోపణలపై క్లీన్ చిట్ ఇవ్వడంతో దాడికి వ్యతిరేకంగా మా వైఖరి మరింత బలపడిందని ఆయన పేర్కొన్నారు. మేము కార్యకలాపాలలో సమర్థతకు కట్టుబడి ఉన్నాము. అందుకే ప్రతికూల పరిస్థితులు మమ్మల్ని పరీక్షించాయని, మునుపటి కంటే మమ్మల్ని బలోపేతం చేశాయని అన్నారు.

Also Read: Indian Navy: మీకు మ్యూజిక్‌లో నైపుణ్యం ఉందా..? అయితే ఈ ఉద్యోగం మీకోస‌మే..!