X Value Down : ‘ఎక్స్‌’ విలువ రూ.3.68 లక్షల కోట్ల నుంచి రూ.78వేల కోట్లకు డౌన్

దీనిపై ఎక్స్‌(X Value Down) కంపెనీ కానీ.. దాని యజమాని ఎలాన్ మస్క్‌ కానీ ఇంకా స్పందించలేదు.

Published By: HashtagU Telugu Desk
Musks X pays 43 CRORES to wrong BANK account

X Value Down :  అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) మార్కెట్ విలువ డౌన్ అయింది.  రెండేళ్ల క్రితం దాదాపు రూ.3.68 లక్షల కోట్లకు ఆయన ట్విట్టర్ కొన్నారు. దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.78వేల కోట్లకు మించి ఉండదని ప్రముఖ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ఫిడెలిటీ అంచనావేసింది. ఎలాన్ మస్క్ కొన్నప్పటి నుంచి ఇప్పటివరకు ‘ఎక్స్‌’ కంపెనీ మార్కెట్‌ విలువ 78.7శాతం డౌన్ అయిందని పేర్కొంది. ఎక్స్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ ఖర్చు చేసిన డబ్బులో నాలుగో వంతు విలువ మాత్రమే ఇప్పుడు మిగిలిందని తెలిపింది. ప్రస్తుతం ఎక్స్‌లో ఉన్న వాటాల విలువ రూ.35 కోట్లకు పడిపోయిందని ఫెడిలిటీ అంచనా వేసింది. దీనిపై ఎక్స్‌(X Value Down) కంపెనీ కానీ.. దాని యజమాని ఎలాన్ మస్క్‌ కానీ ఇంకా స్పందించలేదు. ట్విటర్‌‌ను కొనేటప్పుడు ఎలాన్ మస్క్‌ రూ.1 లక్ష కోట్లను బ్యాంకుల నుంచి అప్పు చేశారు. ఇందులో రూ.50వేల కోట్లను టర్మ్‌ లోన్‌గా.. మిగిలిన రూ.50వేల కోట్లను బాండ్ల రూపంలో సమీకరించారు. ప్రస్తుతం ఈ సొమ్మును రుణదాతలకు తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఎక్స్ ఉంది.

Also Read :US Visas : భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్.. మరో 2.50 లక్షల వీసా అపాయింట్‌మెంట్లు

  •  ట్విట్టర్‌ను కొన్నప్పటి నుంచి దాన్ని తనదైన శైలిలో ఎలాన్ మస్క్ నడిపిస్తున్నారు.
  • ఎక్స్‌లోని ప్రతీ విభాగం నుంచి ఆదాయాన్ని సంపాదించాలనే ప్లాన్‌తో ఎలాన్ మస్క్ ముందుకు పోతున్నారు. ఈవిధానం వల్లే ఎక్స్ యూజర్లు తగ్గిపోయి, ఆదాయం పడిపోయిందని అంటున్నారు.
  • ఎక్స్‌కు వచ్చే యాడ్ రెవెన్యూ తగ్గిపోయింది. దాని ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీసుకునే వారి సంఖ్య కూడా అంతంత మాత్రంగానే ఉంది.
  • ఎక్స్‌లో కామెంట్ పెట్టాలన్నా ఎన్నో కండీషన్స్ ఉండటం వల్ల యూజర్లు కలవరానికి గురవుతున్నారు.
  • ఈనేపథ్యంలో ఈ సంవత్సరం మేలో ఎక్స్‌ఏఐ సంస్థ రీసెర్చ్ కోసం6 బిలియన్‌ డాలర్లను సమీకరించింది. ఎక్స్‌ఏఐ సరికొత్తగా గ్రోక్‌ అనే చాట్‌బాట్‌ను తయారు చేసింది.

Also Read :2 Crore SIMs : ఫేక్ సిమ్‌కార్డుల ఖేల్ ఖతం.. కోట్లాది ‘సిమ్‌’‌లు రద్దు!

  Last Updated: 30 Sep 2024, 05:02 PM IST