పసిడి ప్రియులకు షాక్.. ఒక్కరోజులో రూ.8 వేలకు పైగా పెరిగిన బంగారం..

Gold Prices  బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల వేళ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,447కు చేరుకుంది. నిన్న రూ.1,62,380గా ఉన్న బంగారం ధర ఈరోజు రూ.8,000కు పైగా పెరిగింది. 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.1,51,000 పలికింది. వెండి ధర రూ.4,00,000 దిశగా పరుగెడుతోంది. హైదరాబాద్‌లో […]

Published By: HashtagU Telugu Desk
Gold And Silver Rate

Gold And Silver Rate

Gold Prices  బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల వేళ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,447కు చేరుకుంది. నిన్న రూ.1,62,380గా ఉన్న బంగారం ధర ఈరోజు రూ.8,000కు పైగా పెరిగింది.

22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.1,51,000 పలికింది. వెండి ధర రూ.4,00,000 దిశగా పరుగెడుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.3.75 లక్షలుగా ఉంది.

ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రూ.26,821 పెరిగి రూ.3.83 లక్షలకు పలికి రికార్డు స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల బంగారం రూ.1.62 లక్షలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధర ఔన్సు 5,296.79 డాలర్లకు, వెండి ఔన్సు 114 డాలర్లకు చేరుకుంది. మరోవైపు, డాలర్ విలువ నాలుగేళ్ల కనిష్ఠానికి పడిపోయింది.

  Last Updated: 28 Jan 2026, 04:42 PM IST