సరికొత్త రికార్డు..85,000 కోట్ల మార్కెట్ క్యాప్ ని టచ్ చేసిన మీషో!

Meesho Shares: మీషో లిమిటెడ్ షేర్లు దుమ్మురేపుతున్నాయి. ఒక్క రోజే 13 శాతానికి పైగా పెరిగి సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. వారం రోజుల్లోనే 10 శాతానికిపైగా లాభ పడడంతో మొదటిసారిగా కంపెనీ మార్కెట్ విలువ రూ. 85,000 కోట్లు దాటింది. ఈ నెలలోనే ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ 55 శాతం ప్రీమియంతో లిస్టింగ్ గెయిన్స్ అందించిన సంగతి తెలిసిందే. ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం. మిడ్ క్యాప్ కేటగిరిలోని ఈ-కామర్స్ […]

Published By: HashtagU Telugu Desk
Meesho Shares

Meesho Shares

Meesho Shares: మీషో లిమిటెడ్ షేర్లు దుమ్మురేపుతున్నాయి. ఒక్క రోజే 13 శాతానికి పైగా పెరిగి సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. వారం రోజుల్లోనే 10 శాతానికిపైగా లాభ పడడంతో మొదటిసారిగా కంపెనీ మార్కెట్ విలువ రూ. 85,000 కోట్లు దాటింది. ఈ నెలలోనే ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ 55 శాతం ప్రీమియంతో లిస్టింగ్ గెయిన్స్ అందించిన సంగతి తెలిసిందే. ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం.

మిడ్ క్యాప్ కేటగిరిలోని ఈ-కామర్స్ కంపెనీ మీషో లిమిటెడ్ (Meesho Limited) షేర్లు అదరగొడున్నాయి. భారీ లిస్టింగ్‌తో వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాయి. క్రితం రోజు ప్రారంభ ట్రేడింగ్ సెషన్లోనే ఏకంగా 13 శాతానికి పైగా పెరిగి సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 193.44 మార్క్ తాకాయి. ఈ కంపెనీ షేర్ గత వారం రోజుల్లోనే 10 శాతానికిపైగా లాభాన్ని తమ షేర్ హోల్డర్లకు అందించింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ విలువ మొదటిసారిగా రూ. 85,000 కోట్లు దాటింది. ఈ కంపెనీ వారం రోజుల క్రితమే స్టాక్ ఎక్స్చేంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టింగ్ అయిన సంగతి తెలిసిందే. 55 శాతం ప్రీమియంతో లిస్టింగ్ గెయిన్స్ అందించి ఔరా అనిపించింది.

స్టాక్ మార్కెట్ క్రితం రోజు ట్రేడింగ్ సెషన్లో మీషో షేరు ధర 5.7 శాతం లాభపడి రూ. 180.5 వద్ద ముగిసింది. ఈ రోజు ట్రేడింగ్‌లోనూ 10 శాతం మేర పెరిగి అప్పర్ సర్క్యూట్ తాకింది. ఇంట్రాడేలో రూ.186.55 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టింది. కొద్ది సేపటికే రూ.199.49 ఇంట్రాడే హై స్థాయిని తాకింది. 52 వారాల గరిష్ఠ ధర సైతం ఇదే కావడం గమనార్హం. ఈ వార్త రాసే సమయానికి 9.32 శాతం లాభంతో రూ.197.14 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల కనిష్ఠ ధర రూ. 153.89 వద్ద ఉన్నాయి. గత వారం రోజుల్లో ఈ షేరు 15 శాతం లాభాన్ని. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 89,320 కోట్లుగా ఉంది. మీషో లిమిటెడ్ దేశంలోని ప్రముఖ వ్యాల్యూ యాడెడ్ ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్‌లో ఒకటి.ఈ కంపెనీ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట ఫామ్స్ ద్వారా లక్షల మంది చిన్న వ్యాపారులు, ఎంటర్ ప్రెన్యూర్స్‌ని తమ కస్టమర్లతో అనుసంధానించి ఫ్యాషన్, హోమ్ అప్లియెన్సెస్, ఎలక్ట్రానిక్స్ సహా పలు వస్తువులు చాలా తక్కువ ధరకే విక్రయిస్తోంది.ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీని డిసెంబర్ 2015వ సంవత్సరంలో ప్రారంభించారు.

 

  Last Updated: 17 Dec 2025, 12:08 PM IST