8th Pay Commission: ఈసారి దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు శుభవార్తలు అందే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవచ్చు. అంతేకాకుండా కరువు భత్యం (DA) కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రెండు నిర్ణయాలు తీసుకుంటే సుమారు 1.2 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది.
కరువు భత్యం ఎంత పెరగవచ్చు?
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 55% DA లభిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ సంవత్సరం రెండో అర్ధభాగంలో ఇది 3% పెరిగే అవకాశం ఉంది. 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు DAను సమీక్షిస్తుంది. సాధారణంగా ఈ సమీక్షల ప్రకటనలు ఫిబ్రవరి-మార్చి, సెప్టెంబర్-అక్టోబర్‌లలో జరుగుతాయి.
Also Read: CM Revanth : రేవంత్ రెడ్డి భవిష్యత్ జాతీయ నాయకుడిగా ఎదగగలరు – రుచిర్ శర్మ విశ్లేషణ
- జనవరి నుంచి జూన్
- జులై నుంచి డిసెంబర్
8వ వేతన సంఘంపై దృష్టి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం జనవరి 2025లో దాని ఏర్పాటుకు సంకేతాలు ఇచ్చినా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే అక్టోబర్ 2025లో దీపావళికి ముందు ఈ కమిషన్ ఏర్పాటుపై నోటిఫికేషన్ విడుదల కావచ్చని భావిస్తున్నారు.
ఒత్తిడి ఎందుకు పెరుగుతోంది?
వేతన సంఘం ఏర్పాటుపై ప్రభుత్వంపై ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది. ఇటీవల రైల్వే ఉద్యోగుల సంఘాలు దీనిపై గట్టిగా ఒత్తిడి తెచ్చాయి. అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య (AIRF) ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే సెప్టెంబర్ 19న దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించింది. ఈ ఒత్తిడి కారణంగా ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.