Site icon HashtagU Telugu

DA Hike: ఉద్యోగుల‌కు బ్యాడ్ న్యూస్‌.. డీఏ కోసం దీపావళి వ‌ర‌కు ఆగాల్సిందే..?

Government Employees

Government Employees

DA Hike: గ‌త కొద్ది రోజులుగా ప్ర‌భుత్వ ఉద్యోగులు ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌న కోసం ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరులో ఉద్యోగుల కరువు భత్యాన్ని (DA Hike) ప్రభుత్వం పెంచబోతున్నట్లు సమాచారం. అయితే ఈ నెలలో పెరిగిన జీతం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వార్తతో షాక్‌కు గురవుతారు. డీఏ పెంపుదల సెప్టెంబరులో ప్రకటించబడదని, అక్టోబర్‌ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందుతోంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డియర్‌నెస్ అలవెన్స్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది. సెప్టెంబరు నుంచి డీఏ అమలు చేయవచ్చని ప్రకటన వెలువడింది. అయితే ఇప్పుడు ఉద్యోగులు మరో నెల రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. మూలాల ప్రకారం.. ఈ నెలలో డీఏకి సంబంధించి ఏదైనా అప్‌డేట్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. దీని కోసం దీపావళి వరకు ఆగాల్సిందే. పండుగకు ముందే ప్రభుత్వం ప్రకటించే అవకాశాలున్నాయి.

Also Read: Electricity Saving Tips : మీ కరెంటు బిల్లు తగ్గాలా ? ఈ టిప్స్ ఫాలో కండి

2022కి సంబంధించి డీఏ పెంపును పరిశీలిస్తే సెప్టెంబర్ 28న డీఏ రేట్లను నాలుగు శాతం పెంచారు. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వచ్చింది. గత సంవత్సరం గురించి మాట్లాడుకుంటే.., దసరా అక్టోబర్ 24న, దీపావళి నవంబర్ 12న వ‌చ్చింది. ఈ సమయంలో కూడా ప్రభుత్వం దీపావళికి ముందు పెంపుదల ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈసారి డీఏ పెంపును కూడా దీపావళికి ముందే ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

డీఏ అంటే ఏమిటి?

DA అంటే డియర్‌నెస్ అలవెన్స్.. దీనిని క‌రువు భ‌త్యం అని కూడా అంటారు. ఇది ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగులకు ఇచ్చే మొత్తం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ కానుకగా ఇచ్చింది. ఇది ఉద్యోగి ప్రాథమిక వేతనంలో నిర్ణీత శాతంగా ఇవ్వబడుతుంది. బేసిక్ జీతంతో పాటు, ఇంటి అద్దె భత్యం వంటి ఇతర మొత్తాలు కూడా డీఏకి జోడించబడతాయి.