UPI Transaction Fees : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వినియోగం మనదేశంలో భారీగా పెరిగిపోయింది. టీ కొట్టు నుంచి మొదలుకొని ఎయిర్ పోర్టు దాకా ప్రతీచోటా క్యూఆర్ కోడ్ స్కానింగ్ లేదా మొబైల్ నంబరు ద్వారా ప్రజలు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు లేకపోవడంతో ప్రజలు నిశ్చింతంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ (UPI Transaction Fees) చేస్తున్నారు. యూపీఐ లావాదేవీలపై ఫీజును వసూలు చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈనేపథ్యంలో యూజర్లలో కొంత ఆందోళన నెలకొంది. ఇటువంటి పరిస్థితుల నడుమ లోకల్ సర్కిల్స్ సంస్థ నెటిజన్లను సర్వే చేసింది.
Also Read :Nitin Gadkari : నాలుగోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామో, రామో చెప్పలేను: గడ్కరీ
ఈ ఏడాది జులై 15 నుంచి సెప్టెంబరు 20 మధ్యకాలంలో దేశంలోని 308 జిల్లాలకు చెందిన 42వేల మంది అభిప్రాయాలను లోకల్ సర్కిల్స్ సంస్థ సేకరించింది. యూపీఐ లావాదేవీలపై ఫీజును వసూలు చేస్తే ఏం చేస్తారు ? అనే ప్రశ్నకు దాదాపు 15,598 మంది నెటిజన్లు తమతమ సమాధానాలు ఇచ్చారు. ఛార్జీలను చెల్లించాల్సిన పరిస్థితే వస్తే యూపీఐ లావాదేవీలు చేయడమే ఆపేస్తామని 75 శాతం మంది చెప్పారు. ఛార్జీని చెల్లించి మరీ యూపీఐ లావాదేవీలు చేసుకునేందుకు తాము రెడీ అని 22 శాతం మంది తెలిపారు.
Also Read :Hydra : హైడ్రా కూల్చివేతలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్.. !
మనదేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో 57 శాతం మేర పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు యూపీఐ లావాదేవీలు 44 శాతం మేర పెరగడం గమనార్హం. దీన్నిబట్టి ప్రజలు యూపీఐ లావాదేవీలకు ఎంతమేర అలవడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. 2022 సంవత్సరంలో మన దేశంలో 8400 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగగా.. 2023లో అత్యధికంగా 10వేల కోట్లకుపైగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.199 ట్రిలియన్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో కేవలం రూ.139 ట్రిలియన్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి.