Site icon HashtagU Telugu

GST 2.0 : GST తగ్గడంతో రోజుకు 277 మెర్సిడెస్ బెంజ్ కార్ల అమ్మకం

Mercedes Benz Cars

Mercedes Benz Cars

భారత ఆటోమొబైల్ మార్కెట్లో (Indian automobile market) లగ్జరీ కార్ల విభాగంలో విశేష స్పందన లభించింది. జీఎస్టీ (GST) తగ్గింపుతో పాటు పండుగ సీజన్ ఆఫర్లు కలసి రావడంతో మెర్సిడెస్ బెంజ్ కంపెనీ అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. నవరాత్రుల సందర్భంగా కేవలం తొమ్మిది రోజుల్లోనే 2,500 కార్లు విక్రయించటం ఆ కంపెనీ చరిత్రలోనే అత్యధికం. సగటున రోజుకు 277 కార్లు అమ్ముడవుతున్నాయని, ఒక్కో కారు సగటు ధర సుమారు రూ.1 కోటి గా ఉన్నట్లు కంపెనీ వివరించింది. ఇది లగ్జరీ కార్ల మార్కెట్లో వినూత్నమైన పెరుగుదలగా భావిస్తున్నారు.

‎Diwali: దీపావళి రోజు ఇంట్లో దీపాలను ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా?

జీఎస్టీ సవరింపు వల్ల లగ్జరీ కార్ల ధరలు 6 శాతం వరకు తగ్గడం* కొనుగోలు దారులను ఆకర్షించిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా కార్లపై ఉన్న ట్యాక్స్ బరువు తగ్గడంతో కస్టమర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. అంతేకాకుండా నవరాత్రులు, దసరా వంటి పండుగల సమయంలో ప్రత్యేక డిస్కౌంట్లు, ఫైనాన్స్ స్కీములు అందించడం కూడా అమ్మకాల పెరుగుదలకు దోహదమైంది. మెర్సిడెస్ బెంజ్ షోరూమ్‌లలో డిమాండ్ భారీగా పెరగడంతో, కొన్నిచోట్ల ముందస్తు బుకింగ్‌లు రెండు వారాలకు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

కంపెనీ తాజా గణాంకాల ప్రకారం.. ఈ సంవత్సరం జూలై నుండి సెప్టెంబర్ మధ్యకాలంలోనే **5,119 కార్లు విక్రయించినట్లు వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి. లగ్జరీ కార్ల విభాగంలో భారత మార్కెట్ వేగంగా విస్తరిస్తుందని, ముఖ్యంగా యువత, కార్పొరేట్ రంగానికి చెందిన కొనుగోలు దారుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు వంటి ఆర్థిక సంస్కరణలు, పండుగ సీజన్ ఉత్సాహం కలిసి రావడంతో లగ్జరీ కార్ల మార్కెట్ మళ్లీ బలపడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Exit mobile version