Site icon HashtagU Telugu

New Tech Jobs : 2028 నాటికి ఏఐ పరివర్తనతో 2.73 మిలియన్ టెక్ ఉద్యోగాలు : సర్వీస్‌నౌ నివేదిక

2.73 million tech jobs with AI transformation by 2028 : ServiceNow report

2.73 million tech jobs with AI transformation by 2028 : ServiceNow report

India : భారతదేశంలోని కీలక వృద్ధి రంగాలలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ప్రతిభను మారుస్తుంది.  2028 నాటికి 2.73 మిలియన్ల కొత్త టెక్ ఉద్యోగాలను సృష్టించనుంది అని వ్యాపార పరివర్తన కోసం ఏఐ ప్లాట్‌ఫారమ్, సర్వీస్‌నౌ నిర్వహించిన ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన ఇండియా తన శ్రామిక శక్తిని 2023లో 423.73 మిలియన్ల నుండి 2028 నాటికి 457.62 మిలియన్లకు పెంచుకునే మార్గంలో ఉంది, ఇది నికరంగా 33.89 మిలియన్ల కార్మికులను జోడించుకోనుంది.

ప్రపంచంలోని ప్రముఖ లెర్నింగ్ కంపెనీ, పియర్సన్ ద్వారా చేయబడిన ఒక పరిశోధన వెల్లడించే దాని ప్రకారం, రిటైల్ రంగం ఉపాధి వృద్ధికి దారితీస్తుందని, దాని విస్తరణకు తోడ్పడేందుకు అదనంగా 6.96 మిలియన్ల కార్మికులు అవసరం. ఈ పెరుగుదల రిటైల్ నిపుణులకు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ మరియు డేటా ఇంజినీరింగ్ వంటి రంగాలలో నైపుణ్యం పెంచుకోవడానికి విలువైన అవకాశాన్ని అందిస్తుంది.  సాంకేతికతతో నడిచే రంగాల కోసం వారిని సన్నద్ధం చేస్తుంది. దీనిని అనుసరించి ఉత్పత్తి (1.50 మిలియన్ ఉద్యోగాలు), విద్య (0.84 మిలియన్ ఉద్యోగాలు), మరియు ఆరోగ్య సంరక్షణ (0.80 మిలియన్ ఉద్యోగాలు), ఆశించిన ఆర్థిక వృద్ధి మరియు సాంకేతిక పరివర్తన ద్వారా ముందుకు సాగుతున్నాయి.

సుమీత్ మాథుర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్, సర్వీస్‌నౌ ఇండియా టెక్నాలజీ & బిజినెస్ సెంటర్ మాట్లాడుతూ.. “భారతదేశపు వృద్ధి కథలో, ముఖ్యంగా అధునాతన సాంకేతిక నైపుణ్యాలు అవసరమయ్యే చోట ఉద్యోగాల సృష్టికి ఏఐ కీలక ఉత్ప్రేరకం అవుతుంది. ఈ వ్యూహాత్మక ప్రాధాన్యత నిపుణుల కోసం మరింత అధిక-విలువ అవకాశాలను సృష్టించడమే కాకుండా శాశ్వత డిజిటల్ కెరీర్‌లను నిర్మించడానికి వారికి శక్తినిస్తుంది. ‘రైజ్‌అప్ విత్ సర్వీస్‌నౌ’ వంటి కార్యక్రమాల ద్వారా మరియు స్థానిక విశ్వవిద్యాలయాలు మరియు ప్రభుత్వ కార్యక్రమాలతో వ్యూహాత్మక భాగస్వామ్యంతో, మేము నైపుణ్య అంతరాన్ని తగ్గించి, విజయవంతం కావడానికి అవసరమైన సాధనాలతో భారతదేశపు శ్రామిక శక్తిని శక్తివంతం చేస్తున్నాము. ఈ ముఖ్యమైన నైపుణ్యాలతో ప్రతిభను సన్నద్ధం చేయడం ద్వారా, ప్రపంచ సాంకేతిక ఆర్థిక వ్యవస్థలో భారతదేశం అగ్రగామిగా ఉండేలా చూసుకోవచ్చు” అని అన్నారు.

పరిశ్రమ పరివర్తనల మధ్య టెక్ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుంది..

టెక్-సంబంధిత ఉద్యోగాలు పరిశ్రమల అంతటా పెరుగుతున్నాయి, విస్తరణకు సిద్ధంగా ఉన్న రంగాలలో ప్రొఫెషనల్, సైంటిఫిక్ మరియు టెక్నికల్ సర్వీసెస్, తయారీ మరియు టెలికమ్యూనికేషన్స్ ఉన్నాయి. ఈ ట్రెండ్‌లో సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలపర్‌లు 109,700 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు (48,800 కొత్త ఉద్యోగాలు) మరియు డేటా ఇంజనీర్లు (48,500 కొత్త ఉద్యోగాలు) ఉన్నాయి. వెబ్ డెవలపర్‌లు, డేటా అనలిస్ట్‌లు మరియు సాఫ్ట్‌వేర్ టెస్టర్లు కోసం కూడా అవకాశాలు పెరుగుతున్నాయి, వీటిలో వరుసగా 48,500, 47,800 మరియు 45,300 ఉద్యోగాల జోడింపులను అంచనా వేస్తున్నారు. అదనంగా, డేటా ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్‌లు, డేటాబేస్ ఆర్కిటెక్ట్‌లు, డేటా సైంటిస్ట్‌లు మరియు కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్‌లు వంటి ఉద్యోగాలలో 42,700 నుండి 43,300 ఉద్యోగాలు వరకు పెరుగుతాయని భావిస్తున్నారు. సాంకేతికత ఆధారిత పురోగమనాల ద్వారా శ్రామికశక్తి వృద్ధికి తోడ్పడుతూ ఇంధనం, ప్రభుత్వ సేవలు మరియు యుటిలిటీస్ వంటి పరిశ్రమల్లో కూడా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ప్రభావం కనిపిస్తుంది.

ఐటిలో సాంకేతిక పాత్రలను పునర్నిర్మిస్తోన్న జెన్ ఏఐ..

అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ప్రభావం వాటిలో ఎలా విభిన్నంగా ఉంటుందో అన్వేషించడానికి కీలకమైన సాంకేతిక ఉద్యోగాలు టాస్క్ స్థాయిలో మూల్యాంకనం చేయబడ్డాయి. వీటిలో, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్‌లు అతిపెద్ద మార్పును చూడగలరు.  వారి వారపు విధులలో 6.9 గంటలు స్వయంచాలకంగా లేదా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ద్వారా పెంచబడతాయి. ఏఐ సిస్టమ్స్ ఇంజనీర్లు కూడా జెన్ ఏఐ నుండి గణనీయంగా ప్రయోజనం పొందుతారు. ఈ పాత్రపై మొత్తం సాంకేతిక ప్రభావంలో సగం నేరుగా ఏఐ సాంకేతికతల నుండి వస్తుంది. అదేవిధంగా, ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్‌లు జెనరేటివ్ ఏఐ యొక్క ఏకీకరణ నుండి గణనీయంగా ప్రయోజనం పొందేందుకు సిద్ధంగా ఉన్నారు.  ఏఐ పునరావృతమయ్యే పనులను చేపట్టడం వలన వారానికి 1.9 గంటలు ఆదా అవుతుంది. తద్వారా వారు మరింత వ్యూహాత్మక ప్రాజెక్టులపై దృష్టి సారిస్తారు. తక్కువ-ప్రభావిత పాత్ర, ప్లాట్‌ఫారమ్ యజమానులు కూడా ప్రతి వారం దాదాపు అరగంట ఆదా చేయగలరు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు టెక్ పర్యావరణ వ్యవస్థ అంతటా పాత్రలను విప్లవాత్మకంగా మారుస్తాయి, నిపుణులు తెలివిగా మరియు వేగంగా పని చేయడానికి వీలు కల్పిస్తాయి.

సుమీత్ మాథుర్ ఇంకా మాట్లాడుతూ .. “సర్వీస్‌నౌ జెన్ ఏఐ అమలులోకి వచ్చిన మొదటి 120 రోజులలో, మేము సర్వీస్‌నౌ అంతటా మరియు కనీస సాంకేతిక ప్రయత్నంతో $5M+ వార్షిక వ్యయం మరియు ఉత్పాదకతలో అదనంగా $4M+ సాధించాము. ఈ రోజు సర్వీస్ నౌ యొక్క మొత్తం ఏఐ విలువలో 30% నౌ అసిస్ట్ నుండి వచ్చింది. మేము వారంవారీ ఉత్పాదకత పని గంటలలో 10% అదనంగా పొందటంతో పాటుగా 48% కోడ్ అంగీకార రేటును చూస్తున్నాము. మేము ఉద్యోగి సేవలతో భారీ ప్రభావాన్ని చూశాము, ఇక్కడ మేము శోధనలో మాత్రమే 62 వేల గంటలను ఆదా చేసాము మరియు ఉద్యోగి డిఫ్లెక్షన్ రేటుకి 14% వృద్ధి చేసాము. సర్వీస్‌నౌ వద్ద ఏఐ మాకు మరింత ఉత్పాదకతను కలిగిస్తుంది మరియు మా కస్టమర్‌లు వారి ఉత్పాదకత లక్ష్యాలను సాధించడంలో సహాయం చేస్తుంది.

భారతదేశంలో ఉద్యోగ సిద్దమైన ప్రతిభావంతులను రూపొందించడం..

ఈ వేగాన్ని ఉపయోగించుకోవడానికి, కంపెనీలు మరియు విధాన నిర్ణేతలు తప్పనిసరిగా నైపుణ్యం పెంచడానికి మరియు సాంకేతికతతో కూడిన వర్క్‌ఫోర్స్‌కి సాఫీగా మారేలా చేయడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి. ‘రైజ్‌అప్ విత్ సర్వీస్‌నౌ’ కార్యక్రమం 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉన్న డిజిటల్ సామర్థ్యాలలో పది లక్షల మంది వ్యక్తులకు శిక్షణనిచ్చే లక్ష్యంతో యువ ఇంజనీర్‌లను ఆచరణాత్మక, ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న నైపుణ్యాలతో సన్నద్ధం చేయడంపై దృష్టి సారించింది. గత 12 నెలల్లో కంపెనీ యొక్క ఏఐ ప్లాట్‌ఫారమ్ పై 97,695 మంది భారతీయులు నైపుణ్యాలను పొందారు. సర్వీస్ నౌ తమ యూనివర్శిటీ అకడమిక్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. దీనికోసం ప్రభుత్వ సంస్థలతో భాగస్వామ్యం చేసుకోవటంతో పాటుగా ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్ బై నాస్కామ్ మరియు ఏఐసిటిఈతో సహా 16 రాష్ట్రాల్లోని 20 విశ్వవిద్యాలయాలతో భాగసస్వామ్యం చేసుకుంది. ఈ ప్రయత్నాల ద్వారా, వారు వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు, టెక్ పరిశ్రమ కోసం ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న ప్రతిభను సృష్టించారు.

Read Also: Ratan Tata: ర‌త‌న్ టాటా వీలునామా.. వెలుగులోకి కొత్త పేరు!

Exit mobile version