Site icon HashtagU Telugu

Hyderabad : అమెజాన్ ఆఫీసులో 100 కోట్ల భారీ మోసం

100 Crores Huge Fraud In Am

100 Crores Huge Fraud In Am

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌(Amazon )ను ఆ సంస్థ ఉద్యోగులు (Amazon Employee), మునుపటి సిబ్బంది కలిసి మోసం (Fraud ) చేశారు. వినియోగదారులకు సరుకులు సరఫరా చేసే క్రమంలో నకిలీ బిల్లులు సృష్టించి దాదాపు రూ. 102 కోట్లను (102 crores) కాజేశారు. వినియోగదారులు చిరునామాలో లేరనే నెపంతో రవాణా చార్జీలు క్లెయిమ్ చేస్తూ ఈ కుట్ర కొనసాగింది. ఈ మోసంలో హైదరాబాద్ ఆఫీసు కీలకంగా పనిచేసిందని అమెజాన్ ప్రతినిధి జీఎస్ అర్జున్ కుమార్ వెల్లడించారు.

Deep Seek AI : అమెరికాకు చైనా ‘డీప్ సీక్’ కలవరం.. డౌన్‌లోడ్లలో నంబర్ 1.. ఎలా ?

హైదరాబాద్‌లోని అమెజాన్ రిలే ఆపరేషన్ సెంటర్ ప్రపంచవ్యాప్తంగా సరుకుల డెలివరీ వ్యవస్థను పర్యవేక్షిస్తుంది. గోడౌన్ నుంచి కస్టమర్ వద్దకు సరుకు చేరేవరకు ప్రతి దశను జీపీఎస్ ఆధారంగా పరిశీలిస్తారు. అయితే, ఈ సిస్టమ్ లోపాన్ని పసిగట్టి, మోసం చేయడానికి కొందరు సిబ్బంది కుట్ర పన్నారు. డెలివరీ సంస్థలకు అమెజాన్ రవాణా ఖర్చు చెల్లించే విధానంలో లొసుగులను ఉపయోగించి నకిలీ ట్రిప్పులు నమోదు చేసి బిల్లులు సృష్టించారు. అమెరికాలో సరుకులు సరఫరా చేసే సిబ్బందితో కలిసి నకిలీ లావాదేవీలు నిర్వహించారు. చిరునామాలో వినియోగదారుడు లేడని సాకుగా చూపిస్తూ రవాణా ఖర్చులను చెల్లించుకున్నారు. అమెజాన్ యాప్‌లో ఫేక్ రికార్డులను అప్‌లోడ్ చేసి, రవాణా దూరం ఆధారంగా భారీ మొత్తాలను వసూలు చేశారు.

ఈ ఘటనపై అమెజాన్ ఫిర్యాదు చేయగా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు విచారణ ప్రారంభించారు. మొత్తం 22 మందిపై కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేపట్టారు. ఇందులో ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న వారు, మాజీ సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. దీనిపై సంబంధిత సిబ్బంది, థర్డ్ కంపెనీ లు ఎలా వ్యవహరించాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.