తెలంగాణ ప్రభుత్వం సహకారంతో 1M1B (వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్) (Global Climate Action Movement 1.5 Matters ) ఏర్పాటు చేసిన 1.5 మేటర్స్ వాతావరణ కార్యాచరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని టి-వర్క్స్‌లో ( T-Works) ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం వాతావరణ మార్పులకు సంబంధించి రాష్ట్రం తీసుకుంటున్న బలమైన నిర్ణయాలను ప్రతిబింబిస్తోంది. పర్యావరణ మార్పులను పరిమితం చేసి, ప్రపంచ ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల సెల్సియస్ లోపల నిలుపుకోవడానికి కేంద్రంగా పనిచేయాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై తెలంగాణ ప్రభుత్వం స్థిరమైన అభివృద్ధి దిశగా సత్వర నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. వేగవంతమైన అభివృద్ధి కారణంగా వాతావరణ సమస్యలు, నీటి కొరత, కాలుష్యం వంటి సమస్యలను నివారించడానికి ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అంతేకాక, 10,000 మంది పౌరులను మరియు పర్యావరణ నాయకులను చేర్చే ఈ ఉద్యమం, తెలంగాణను పర్యావరణా అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ముందడుగు వేస్తుంది.
1.5 మేటర్స్ మూడు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టింది. మొదటిగా, అవగాహనను కలిగించే యాక్షన్-ఓరియెంటెడ్ క్యాంపెయిన్‌లు, రెండవది సీసూట్ ఎగ్జిక్యూటివ్‌లు మరియు నిపుణుల తోచిన పరిష్కారాలతో కూడిన లీడర్‌షిప్ ఫోరమ్‌లు, మూడవది పరిశ్రమల స్థిరత్వాన్ని అంచనా వేసే సర్టిఫికేషన్ విధానం. ఈ విధానం సిల్వర్, గోల్డ్, ప్లాటినం స్థాయిలో పర్యావరణ శ్రేష్ఠతను గుర్తించి ప్రోత్సహిస్తుంది.తెలంగాణ యువతను వాతావరణ మార్పులలో ముందుండే నాయకులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. 1M1B గ్రీన్ స్కిల్స్ అకాడమీ ద్వారా ఎంపికైన ప్రతినిధులు, డిసెంబర్ 12, 2024న న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సమ్మిట్‌లో రాష్ట్ర ప్రతిష్టను నిలబెట్టనున్నారు. మంత్రి ఈ సందర్భంగా యువతను ప్రశంసిస్తూ, తెలంగాణ యొక్క పర్యావరణ దృక్పథానికి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు.
Read Also : Pushpa 2 First Day Collections : బాక్సాఫీస్ పై పుష్పరాజ్ పంజా.. పుష్ప 2 ఫస్ట్ డే 294 కోట్లు..!