Site icon HashtagU Telugu

Zontas Bikes: కే‌టి‌ఎం, బి‌ఎం‌డ‌బ్ల్యూ బైక్‌ల‌కు పోటీగా చైనీస్ కంపెనీ బైక్‌.. ప్ర‌త్యేక‌త‌లివే..!

350r Imresizer

350r Imresizer

చైనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జోంటెస్ వారి 350ఆర్ మోడల్‌ను భార‌త మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇది నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్. 350R బైక్‌, KTM 390 డ్యూక్, BMW G 310 Rలకు పోటీగా భారత మార్కెట్‌లో వ‌చ్చింది. ఈ బైక్ ధర క‌ల‌ర్స్‌పై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఈ బైక్ ధర మరింత‌ పెరగవచ్చు.

Zontes 350R తయారీదారుల లైనప్‌లోని ఇతర మోటార్‌సైకిళ్లు ఉపయోగిస్తున్న అదే ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 348 cc, సింగిల్-సిలిండర్ ఇంజన్, ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఇది లిక్విడ్-కూల్డ్, DOHC సెటప్‌ను పొందుతుంది. ఇది 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 38.8 బిహెచ్‌పి అత్య‌ధిక‌ శక్తిని, 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 32.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వ‌చ్చింది.

Zontes 350R అంగులర్ హెడ్‌ల్యాంప్‌ పొందుతుంది. ఎక్స్టెంటెడ్ ట్యాంక్ ష్రౌడ్, స్లాష్-కట్ ఎగ్జాస్ట్, స్టెప్-అప్ స్టైల్ సీటుతో కూడిన మస్కులర్ ఫ్యూయెల్ ట్యాంక్‌ ఇచ్చారు. బైక్ ఆల్-LED లైటింగ్, స్లిప్పర్ క్లచ్, బ్లూటూత్ కనెక్టివిటీతో 5.0-అంగుళాల ఎల్‌సి‌డి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, కీలెస్ కంట్రోల్స్, డ్యూయల్ ఫాస్ట్ ఛార్జింగ్ USB, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇంకా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్లు. అయితే భార‌త్‌లో మహావీర్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన‌ అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ఈ బైక్‌ల‌ను సేల్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కొత్త మోటో వాల్ట్ డీలర్‌షిప్‌ల ద్వారా ఈ బైక్స్ విక్రయించ‌నున్నారు.

జోన్టెస్ 350R బ్లూ ధ‌ర రూ. 3,15,000, జోన్టెస్ 350R బ్లాక్ ధ‌ర రూ. 3,25,000, జోన్టెస్ 350R వైట్ ధ‌ర రూ. 3,25,000, జోన్టెస్ 350X బ్లాక్ అండ్ గోల్డ్ ధ‌ర రూ. 3,35,000, జోన్టెస్ 350X సిల్వర్ అండ్ ఆరెంజ్ ధ‌ర రూ. 3,45,000, జోన్టెస్ 350X బ్లాక్ అండ్ గ్రీన్ ధ‌ర రూ. 3,45,000, జోన్టెస్ GK350 బ్లాక్ అండ్ బ్లూ ధ‌ర రూ. 3,37,000గా ఉంది.