Zelio Ebikes: మార్కెట్ లోకి నయా మేడ్ ఇన్ ఇండియా స్కూటర్.. ఫీచర్స్ ఇవే?

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పర్యావరణానికి ఎటువంటి హనీ లేకపోవడంతో ప్రభుత్వం కూడా ఈ వాహనాలకు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. దానికి తోడు పెట్రోల్, డిజిల్ ధరలు కూడా ఆకాశాన్నంటుతుండడంతో వాహన వినియో

Published By: HashtagU Telugu Desk
Mixcollage 06 Jul 2024 06 02 Pm 820

Mixcollage 06 Jul 2024 06 02 Pm 820

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పర్యావరణానికి ఎటువంటి హనీ లేకపోవడంతో ప్రభుత్వం కూడా ఈ వాహనాలకు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. దానికి తోడు పెట్రోల్, డిజిల్ ధరలు కూడా ఆకాశాన్నంటుతుండడంతో వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కంపెనీల మధ్య చాలా పోటీ వాతావరణం నెలకొంటోంది. దిగ్గజ కంపెనీలతో పాటు స్టార్టప్‌లు, కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.

ఇదే క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల తయారీ సం‍స్థ అయిన జీలియో ఈ బైక్స్‌ ఈ జూలై నెలలోనే కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ నుంచి వస్తున్న 14వ మోడల్‌ ఇది. ఈ కొత్త స్కూటర్‌ పూర్తిగా మేడ్‌ ఇన్‌ ఇండియా అని జీలియో పేర్కొంది. దీనికి సంబంధించిన టీజర్‌ ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన ధరలు కంపెనీ విడుదల చేయలేదు. స్కూటర్‌ ఆవిష్కరణ రోజే ధర కూడా వెల్లడిస్తామని తెలిపారు. కంపెనీ ప్రకటించిన ప్రధాన అంశాలలో దీని రేంజ్‌ కూడా ఒకటి.

ఇది సింగిల్‌ చార్జ్‌ పై 100 కిలో మీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. అలాగే గరిష్టంగా 70 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. స్కూటర్‌ లోడ్‌ సామర్థ్యం 180 కిలోలు ఉంటుందని జీలియో పేర్కొంది. ఈవీ టూ వీలర్ బ్రాండ్ ఇటీవల గ్రేసీ సిరీస్ స్కూటర్లను ప్రారంభించడంతో తక్కువ వేగవంతమైన ఉత్పత్తి పోర్ట్ఫోలియోను విస్తరించింది. ఇందులో గ్రేసీ, గ్రేసీ ప్రో వంటి మోడళ్లు ఉన్నాయి. ఇకపోతే వీటి ధర విషయానికి వస్తే.. రూ.59,273 నుంచి రూ. 83,073 మధ్య ఉంది. దీని తర్వాత రూ. 64,543 నుంచి రూ. 87,573 ఎక్స్  షోరూమ్ వరకు ఎక్స్‌ మెన్ స్కూటర్లను పరిచయం చేసింది. లెజెండర్, ఈవా, లాజిక్స్, మిస్టరీ వంటి ఇతర శ్రేణి స్కూటర్లు ఆఫర్లు ఉన్నాయి.

  Last Updated: 06 Jul 2024, 06:03 PM IST