చాలామంది కారు నడిపేటప్పుడు స్పీడ్ బ్రేకర్ దగ్గర గ్రౌండ్ క్లియరెన్స్ తాకుతుంది అని కంగారు పడుతూ ఉంటారు. అయితే అలా గ్రౌండ్ క్లియరెన్స్ తాకుతుంది అనుకున్న వారు కొన్ని రకాల విషయాలను పాటిస్తే చాలు. మీ కారు గ్రౌండ్ క్లియరెన్స్ స్పీడ్ బ్రేకర్ కి తాకదు. అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాయిల్ స్ప్రింగ్ అస్సిస్ట్ తో మీరు మీ కారు గ్రౌండ్ క్లియరెన్స్ ని ఈజీగా పెంచుకోవచ్చు. అస్సిస్టర్ పాలియురేతేన్ మన్నికైన పదార్థంతో తయారు చేయబడుతుంది. ఇవి స్ప్రింగ్ కాయిల్స్ మధ్య అమరచబడి ఉండి అవి టఫ్ గా మారుతాయి.
ఈ కాయిల్ స్ప్రింగ్ అస్సిస్ట్ ఇన్స్టాల్ చేసిన తరువాత కారు ఎత్తును కనీసం 10 నుంచి 15 ఎంఎం వరకు పెంచుకోవచ్చు. మార్కెట్లో చాలా రకాల ఆయిల్ ఆసిస్టర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే కారు గ్రౌండ్ క్లియరెన్స్ ను పెంచడానికి మరొక మార్గం గట్టి సస్పెన్షన్ సెటప్. ఈ ప్రాసెస్ లో కారుకు అటాచ్ చేసిన సస్పెన్షన్ సెటప్ కారు నుండి తీసివేయబడుతుంది. అంతేకాకుండా కారు ఎత్తును 10 నుంచి 15 ఎంఎం వరకు పెంచవచ్చు. అయితే కొన్ని రకాల కార్లలో మాత్రమే ఇలాంటి సెటప్ ను కంపెనీలే కనిపిస్తాయి. కారులో అటువంటి సెటప్ ను ఇన్స్టాల్ చేసిన తర్వాత సస్పెన్షన్ కఠినంగా మారుతుంది.
అంటే స్టాఫ్ సస్పెన్షన్తో పోలిస్తే కారు బ్యాలెన్స్ ను కూడా మెరుగుపరుస్తుంది. ఇందుకోసం 50,000 వరకు కూడా ఖర్చు అవుతుంది. కారు గ్రౌండ్ క్లియరెన్స్ ని పెంచిన తర్వాత మీరు స్పీడ్ బ్రేకర్ ని సులభంగా దాటవచ్చు. అంతేకాకుండా కారు డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే కార్లలో గ్రౌండ్ క్లియరెన్స్ పెంచడం కోసం కొందరు కారులో పెద్ద టైర్లు ఇంకా రిమ్ములను ఇన్స్టాల్ చేయడానికి ఇష్టపడతారు. పద్ధతి వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇది కారు యొక్క ఎత్తును పెంచుతుంది.