Ola electric scooter: ఇకపై రెంట్ కి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్.. ఎప్పటి నుంచి తెలుసా?

ప్రముఖ ఎలక్ట్రిక్ సంస్థ ఓలా వాహన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసి

Published By: HashtagU Telugu Desk
Mixcollage 01 Jan 2024 07 28 Pm 4631

Mixcollage 01 Jan 2024 07 28 Pm 4631

ప్రముఖ ఎలక్ట్రిక్ సంస్థ ఓలా వాహన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓలా సంస్థ కేవలం ఎలక్ట్రిక్ వినియోగదారులకు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయలేకపోతున్న వారికి కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అదేమిటంటే​ రెంటల్​ సర్వీస్ తో త్వరలోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ ఓలా ఎలక్ట్రిక్​ సీఈఓ భవిష్​ అగర్వాల్​ చేసిన ఒక ట్వీట్​ ప్రస్తుతం వైరల్​గా మారింది.

పర్యాటక ప్రాంతాల్లో ఓలా ఎస్​1 ప్రాడక్ట్స్​ రెంటల్​ సర్వీస్​ మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నాము. దీనిపైన మీ స్పందనేంటి? ఏవైనా సూచలు ఇస్తారా? దేశంలోని ఏ ప్రాంతాల్లో ఈ సేవలు వినియోగించుకోవాలని మీరు అనుకుంటున్నారు?అని ట్వీట్​ చేశారు భవిష్​ అగర్వాల్​. అంతే కాకుండా బెస్ట్​ కామెంట్​, సూచన చేసిన ఒకరికి ఓల్​ ఎస్​ఎక్స్​+ ఇస్తామని ని కూడా ట్వీట్ లో పేర్కొన్నారు భవిష్ అగర్వాల్. కాగా ఆయన చేసిన ట్వీట్ ​ని బత్తి చూస్తుంటే ఈ ఓలా ఎలక్ట్రిక్​ రెంటల్​ సర్వీస్​ ఐడియా ప్రస్తుతం ఎర్లీ స్టేజ్​లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ ఈ ఐడియా కార్యరూపం దాల్చితే మాత్రం చాలా ప్రయోజనాలు ఉంటాయని మార్కెట్​ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్​ స్కూటర్ల యాక్సెసబులిటీ, అఫార్డెబులిటీ పెరుగుతుందని అంటున్నాయి. ఇండియాలో ఈ తరహా రెంటల్​ బిజినెస్​ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. 2 వీలర్​ రెంటల్​ బిజినెస్​లోకి 2023లో ఎంట్రీ ఇచ్చింది రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థ. 25 నగరాల్లో ఈ సేవలను తీసుకొచ్చింది. 300 కుపైగా బైక్స్​ని అందుబాటులో ఉంచింది. ఇందుకోసం 40 కిపైగా మోటర్​ సైకిల్​ రెంటల్​ ఆపరేటర్స్​తో డీల్​ కుదుర్చుకుంది. ఇక రాయల్​ ఎన్​ఫీల్డ్​ రెంటల్​ సర్వీస్​ బిజినెస్​ నుంచి ఓలా ఎలక్ట్రిక్​ నేర్చుకునేందుకు అవకాశం ఉంది.

ఫ్లెక్సిబులిటీ, ఛార్జీలు వంటి వాటిపై ఒక క్లారిటీ రావొచ్చు. ఒకవేళ ఈ రెంటల్​ ఐడియా అమల్లోకి వస్తే.. ఇప్పటికే అందుబాటులో ఉన్న తమ మొబైల్​ యాప్​లో ఈ సేవలను కూడా పొందుపరిచే యోచనలో ఓలా ఎలక్ట్రిక్​ ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి రెంటల్​ సర్వీసులు ఊపందుకున్నాయి. చాలా మంది సొంతంగా ఒక బైక్స్​, స్కూటర్​​ని తీసుకుని టూర్​ని ఎంజాయ్​ చేసేందుకు ఇష్టపడుతున్నారు. గోవా, మనాలీ, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో మంచి బిజినెస్​ జరుగుతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ 2024 తొలినాళ్లల్లో ఓలా ఎలక్ట్రిక్​ నుంచి రెంటల్​ సేవలు లాంచ్​ అయ్యే అవకాశం ఉంది.

  Last Updated: 01 Jan 2024, 07:29 PM IST