Car Deals: కారు కొనాలనుకుంటున్నారా.. దిమ్మతిరిగే విధంగా ఇయర్ అండ్ ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్?

త్వరలోనే 2024 రాబోతోంది. ఇక మరొక మూడు వారాల్లో ఈ ఏడాది ముగియనుంది. దీంతో వివిధ రంగాలకు చెందిన కంపెనీలు వాటి ప్రోడక్ట్ లపై భారీగా డిస్కౌంట్ ప

Published By: HashtagU Telugu Desk
Mixcollage 08 Dec 2023 01 53 Pm 120

Mixcollage 08 Dec 2023 01 53 Pm 120

త్వరలోనే 2024 రాబోతోంది. ఇక మరొక మూడు వారాల్లో ఈ ఏడాది ముగియనుంది. దీంతో వివిధ రంగాలకు చెందిన కంపెనీలు వాటి ప్రోడక్ట్ లపై భారీగా డిస్కౌంట్ ప్రకటిస్తున్నాయి. ఇయర్ ఎండ్ సేల్స్ లో భాగంగా కళ్ళు చెదిరే ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈ విషయంలో ముందుంది. మారుతి సుజుకి, హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్, మహీంద్రా, హోండా, ఇతర కంపెనీలు ఇప్పటికే వివిధ కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్లు ప్రకటించాయి. సెలక్టెడ్ మోడళ్లపై మంచి డిస్కౌంట్లను అందిస్తున్నాయి. కాగా కొత్త కార్లు కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారికి ఇది చాలా బెస్ట్ సమయం అని చెప్పవచ్చు. మరి ఏ ఏ కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మారుతి సుజుకి.. కంపెనీ జిమ్నీ SUV, జెటా వేరియంట్‌ పై రూ. 2.3 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే టాప్-స్పెక్ ఆల్ఫా వేరియంట్‌ను రూ.1 లక్ష డిస్కౌంట్‌ తో కొనుగోలు చేయవచ్చు. మారుతి సుజుకి నుంచి కొత్తగా వచ్చిన ఫ్రాంక్స్ మోడల్‌పై రూ. 40వేల డిస్కౌంట్ ఉంది. హైబ్రిడ్ ఇంజిన్‌తో వచ్చిన ప్రీమియం మోడల్ గ్రాండ్ విటారా ధర రూ. 30,000 తగ్గింది.

హ్యుందాయ్.. హ్యుందాయ్ కంపెనీ కోనా ఈవీ పై రూ. 3 లక్షల భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. కంపెనీ నుంచి వచ్చిన ప్రీమియం SUV టక్సన్, పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లపై రూ. 1.5 లక్షల డిస్కౌంట్లు ఉన్నాయి. పాత i20 మోడళ్లను రూ. 50,000 బెనిఫిట్స్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫేస్‌లిఫ్టెడ్ ఐ20 ఎడిషన్‌పై రూ.20,000 డిస్కౌంట్‌ ఉంది.

మహీంద్రా.. మహీంద్రా XUV400, XUV300 వంటి మోడళ్లపై మంచి ఇయర్ ఎండ్ డీల్స్ ప్రకటించింది. కంపెనీ XUV400 ఎలక్ట్రిక్ మోడళ్ల పై ఏకంగా రూ. 4.2 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. XUV300 మోడల్‌పై రూ. 1.72 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.

జీప్… ఈ కంపెనీ ఫ్లాగ్‌షిప్ SUV గ్రాండ్ చెరోకీ మోడల్‌ పై ఏకంగా కళ్ళు చెదిరే విధంగా రూ.11.85 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. పవర్‌ఫుల్ 2.0L టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన ఈ వెహికల్ 272 bhp పవర్, 400 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అలాగే జీప్ మెరిడియన్ కారును రూ.4.85 లక్షల బెనిఫిట్స్‌తో సొంతం చేసుకోవచ్చు. జీప్ ఎంట్రీ-లెవల్ SUV కంపాస్ పై రూ. 2.05 లక్షల డిస్కౌంట్ ఉంది.

హోండా.. స్టైలిష్ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ కంపెనీ, హోండా సిటీ మోడల్‌ పై రూ. 88,600 డిస్కౌంట్ అనౌన్స్ చేసింది. 1.5-లీటర్ ఇంజిన్‌తో నడిచే ఈ సెడాన్‌ మార్కెట్లో సక్సెస్ అయింది.

  Last Updated: 08 Dec 2023, 01:55 PM IST