Site icon HashtagU Telugu

Yamaha: కొత్త ఫీచర్లతో మళ్లీ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న ఆర్ఎక్స్ 100 బైక్.. ఖరీదు ఎంతంటే?

Yamaha Rx100

Yamaha Rx100

మార్కెట్లో ఎన్నో రకాల బైక్ లు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ తరం యువత ఎక్కువగా ఇష్టపడే బైక్ యమహా ఆర్ఎక్స్ 100. ఈ యమహా ఆర్ ఎక్స్ 100 కి యూత్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఈ ఆర్ఎక్స్ 100 బైక్ అప్పట్లోనే యూత్ ని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. కాగా ఈ బైకులను నిలిపివేసి ఇప్పటికే 25 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ అక్కడక్కడ ఇలాంటి బైకులు రోడ్డుపై దర్శనం ఇస్తూ ఉంటాయి. అయితే ఇప్పట్లో యువత కొంతమంది నేటి జనరేషన్ తగ్గట్టుగా బైకులు ఇష్టపడుతుంటే, ఇంకొందరికి మాత్రమే యమహా ఆర్ఎక్స్ 100 బైక్ కన్ను ఉంటుంది.

అయితే యమహా ఆర్ఎక్స్ 100 లవర్స్ కు మహా కంపెనీ తాజాగా ఒక శుభవార్తను చెప్పింది. ఆర్ఎక్స్ 100 బైక్ ను అత్యధిక ఫ్యూచర్లతో అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా యమహా ఇండియా చైర్మన్‌ ఐషిన్ చిహానా మాట్లాడుతూ.. కొత్తగా రాబోతున్న యమహా ఆర్ఎక్స్ 100 ఆధునిక డిజైన్ , స్టైలిష్‌ లుక్‌తో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాము అని తెలిపారు. ఈ బైక్‌ పాత మోడల్‌కి మార్కెట్లో ఇప్పటికీ డిమాండ్‌ ఉంది, వాటిని దృష్టిలో పెట్టుకుని బైక్‌ లవర్స్‌ని ఆకట్టుకునేలా డిజైన్‌, తయారీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

2026 తర్వాత మార్కెట్లోకి కొత్త వెర్షన్‌ ఆర్‌ఎక్స్‌100 బైక్‌ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఈ మూడేళ్ల వ్యవధిలో యమహా ఎలక్ట్రిక్ స్కూటర్‌లు అందుబాటులోకి తీసుకొని రానుంది. ఈ యమహా ఎలక్ట్రిక్ స్కూటర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం యమహాకు భారత్‌లో గ్రేటర్‌ నోయిడా, చెన్నైలో ప్రొడక్షన్‌ యూనిట్లు ఉన్నాయి. అయితే ఈ ఆర్ఎక్స్ 100 బైక్ ధర ఎంత? అందులో కొత్త కొత్త ఫీచర్లు ఏముంటాయి? అన్న విషయాలను ఇంకా వెల్లడించలేదు

Exit mobile version