Site icon HashtagU Telugu

Xiaomi Car : టెస్లా కార్లను మించిన మైలేజీతో షావోమి ఎలక్ట్రిక్ కారు.. ‘SU7’

Xiaomi Car

Xiaomi Car

Xiaomi Car : చైనీస్ టెక్ దిగ్గజం షావోమి (Xiaomi) తన తొలి ఎలక్ట్రిక్ కారు (EV) ‘SU7’ను ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ కారులో SU7, SU7 మ్యాక్స్ అనే వేరియంట్లను అందుబాటులోకి తెచ్చింది. SU7 అనేది రేర్ వీల్ డ్రైవ్ వర్షన్. SU7 మాక్స్ అనేది ఆల్ వీల్ డ్రైవ్ వర్షన్.  SU7  కారును స్టార్ట్ చేసిన 5.28 సెకన్లలోనే గంటకు 100 మీటర్ల స్పీడ్‌ను పుంజుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 210 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు.  ఇక SU7 మాక్స్ కారును స్టార్ట్ చేసిన 2.78 సెకన్లలోనే గంటకు 100 మీటర్ల స్పీడ్‌ను పుంజుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 265 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఈ కార్లను బీజింగ్‌లో ఉన్న చైనా ప్రభుత్వ వాహన తయారీ సంస్థ BAIC గ్రూప్ ఫ్యాక్టరీలో తయారు చేయనుండటం గమనార్హం. అక్కడ ప్రతి సంవత్సరం 2 లక్షల SU7 కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది.  ఈ కారు విడుదల సందర్భంగా Xiaomi కంపెనీ CEO లీ జున్ మాట్లాడుతూ.. వచ్చే 15 నుంచి 20 సంవత్సరాల్లోగా ప్రపంచంలోని టాప్ 5 ఆటోమేకర్లలో ఒకటిగా షావోమి నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈక్రమంలో తమ కంపెనీ నుంచి ‘‘స్పీడ్ అల్ట్రా’’ అనే సెడాన్ మోడల్ ఇంకొన్ని నెలల్లో మార్కెట్లోకి రిలీజ్ అవుతుందని ఆయన తెలిపారు. రానున్న పదేళ్లలో కార్ల(Xiaomi Car) తయారీ విభాగంలో రూ.83వేల కోట్లను పెట్టుబడిగా పెడతామని ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: 100 Billion Dollars : తొలిసారిగా ఒక మహిళకు రూ.8 లక్షల కోట్ల సంపద.. ఎవరు ?