Site icon HashtagU Telugu

Xiaomi SU7: ఇండియలో ఎలక్ట్రిక్‌ కారును ప్రదర్శించిన షావోమీ.. ఫీచర్స్ గురించి తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

Mixcollage 14 Jul 2024 11 11 Am 3134

Mixcollage 14 Jul 2024 11 11 Am 3134

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ గురించి డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగకపోవడంతో ప్రభుత్వాలు కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా మదర్ తెలుపుతున్నాయి. దానికి తోడు డీజిల్,పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం లభిస్తుండడంతో వాహన వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని దిగ్గజ ఆటో మొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్‌ చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రాకిన్‌ దిగ్గజం షావోమీ సైతం ఒక ఎలక్ట్రిక్‌ కారును తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అలాగే ఆ దేశంలో తొలి ఎలక్ట్రిక్ సెడాన్‌ కారును కూడా ఆవిష్కరించింది. ఇంకా అధికారికంగా ఈ కారును లాంచ్‌ చేయకపోయినప్పటికీ కారులో ఉన్న ఫీచర్లను తెలుపుతూ ప్రదర్శనలు నిర్వహిస్తోంది. అలాగే తాజాగా షావోమీ ఇండియాలో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో భారత్ లో కూడా ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించింది. అధునాతన ఫీచర్లుతో కూడిన ఈ కారు యూజర్లను ఆకట్టుకుంటోంది. మరి ఈ కారు ప్రత్యేకతల విషయానికి వస్తే..

షావోమీ ఈ కారును పూర్తి స్థాయి హై పెర్ఫార్మెన్స్ ఎకో సిస్టమ్ సెడాన్‌గా డెవలప్‌ చేసింది. ఈ కారులో ఇ మోటార్, సీటీబీ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ, షియోమి డై కాస్టింగ్, షియోమి పైలట్ అటానమస్ డ్రైవింగ్, స్మార్ట్ క్యాబిన్ వంటివి ప్రత్యేకంగా డెవలప్‌ చేశారు. కంపెనీకి చెంది సుమారు 3400 మంది ఇంజనీర్లు, 1000 మంది టెక్నికల్ సిబ్బంది కృషి చేశారు. ఇకపోతే ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కారు గరిష్టంగా 673 హెచ్‌పి పవర్, 838 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. కేవలం 2.78 సెకన్లలో 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదు. షావోమీ కారు గరిష్టంగా 265 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇక ఈ కారును ఒక్కసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే ఏకంగా 800 కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చు. ఈ కారులో 56 ఇంచెస్ హెడ్ అప్ డిస్‌ప్లే, రొటేటింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 16.1 ఇంచెస్ 3కే అల్ట్రా క్లియర్ కంట్రోల్ స్క్రీన్, మూవింగ్ డ్యాష్‌బోర్డ్ వంటి అధునాతన ఫీచర్లను కూడా అందించారు. ఈ కారుకు సంబంధించిన మరిన్ని ఫీచర్లు అలాగే ధర విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.