Site icon HashtagU Telugu

Xiaomi Electric Car: ఆ బ్రాండ్ కార్లకు పోటీగా జియోమీ సరికొత్త ఎలక్ట్రిక్ కార్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?

Mixcollage 14 Jan 2024 02 47 Pm 7317

Mixcollage 14 Jan 2024 02 47 Pm 7317

చైనాకు చెందిన జియోమీ బ్రాండ్ ఇప్పటి వరకు ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే జియోమీ ఇప్పుడు ఆటో రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. అంతేకాకుండా రానున్న కాలంలో ప్రపంచంలో టాప్ ఐదు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల్లో ఒకరిగా నిలవడమే తన లక్ష్యం అని పేర్కొంది. తన భవిష్యత్ ప్రణాళికను సైతం ప్రకటించింది. ఆ కొత్త జియోమీ ఎలక్ట్రిక్ కారు పేరు ఎస్‌యూ7. ఇది సెడాన్ కు చెందిన మోడల్ కారు. జియోమీ ఫోన్లలో షేర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను అనుసంధానించే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

దీంతో గ్లోబల్ మార్కెట్లో టాప్ బ్రాండ్ల మధ్య ధరల యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. అంతకాకుండా ఈ జియోమీ కారు ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్లలో టాప్ బ్రాండ్లుగా వెలుగొందుతున్న టెస్లా, పోర్షే బ్రాండ్లతో ఇది పోటీని ఇవ్వాబోతోందట. ఇదే విషయాన్నీ జియోమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జున్ ప్రకటించారు. బీజింగ్‌లో జరిగిన లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆ లెవెల్లో ఈ జియోమీ సెడాన్ కారును తీర్చిదిద్దినట్లు చెప్పారు. దీనిలో ఆయా కార్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఫీచర్లు ఉంటాయని పేర్కొన్నారు. రాబోయే 15 నుంచి 20 సంవత్సరాలలో కష్టపడి పనిచేయడం ద్వారా, తాము ప్రపంచంలోని టాప్ 5 ఆటోమేకర్లలో ఒకరిగా అవుతామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

చైనాలో మొత్తం ఆటోమొబైల్ పరిశ్రమను పైకి తీసుకురావడానికి కృషి చేస్తామని లీ ఈ కారు ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో చెప్పారు. ఒక దశాబ్ద కాలంలో దాదాపు 10 బిలియన్ల డాలర్లు అనగా దాదాపు రూ. 83,171 కోట్లు పెట్టుబడి పెట్టడానికి తాము నిర్ణయం తీసుకున్నట్లు లీ జున్ చెబుతున్నారు. ఆటోమేటిక్ డ్రైవింగ్ సామర్థ్యాలను బట్టి ఇది పరిశ్రమలో ముందంజలో ఉంటుందని చెబుతున్నారు. ఏడాదికి 200,000 కార్ల తయారీ లక్ష్యంగా జియోమీ ఉత్పత్తి సైతం ప్రారంభించింది.

అందుకోసం ప్రభుత్వ యాజమాన్య వాహన తయారీ సంస్థ బీఏఐసీ గ్రూప్ యూనిట్ ఈ వాహనాలను తయారు చేస్తోంది.
జియోమీ ఎస్‌యూ 7 సెడాన్ బేస్ మోడల్లో 73.6 కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అదే ప్రీమియం వేరియంట్ లో 101కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 800 కిలోమీటర్ల పరిధిని సాధించగలదని అంచనా. బేస్ వేరియంట్ గరిష్టంగా 210 కిలోమీటర్లు, ప్రీమియం వేరియంట్ 265 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాగా మరో మోడల్ ను కూడా జియోమీ ప్రారంభించేందుకు సిద్ధమైంది. జీయోమీ వీ8 పేరిట దానిని తీసుకొస్తోంది.

Exit mobile version