Electric Car: ప్రపంచంలోనే మొట్టమొదటి ఓపెన్ టాప్ ఎలక్ట్రిక్ కారు

ప్రపంచం వేగంగా మారుతోంది. కార్లలో విప్లవం కనిపిస్తోంది.

BMW సొంత కంపెనీ.. మినీ కూపర్ (Mini Cooper).. మినీ కూపర్ SE కన్వెర్టబుల్‌ని లాంచ్ చేయడం ద్వారా.. ఎలక్ట్రిక్ కార్ల (Electric Car) తయారీలోకి అడుగుపెట్టినట్లైంది. మరెన్నో రకాల కార్లను ఎలక్ట్రిక్ మోడ్‌లోకి (Electric Car) మార్చాలని ఈ కంపెనీ ఆలోచిస్తోంది. మినీ కూపర్ SE కన్వెర్టబుల్ డిజైన్ గమనిస్తే.. దీని రూఫ్.. మడతపెట్టుకునే క్లాత్ టాప్‌తో.. యూనియన్ జాక్ డిజైన్‌తో ఉంది. హెడ్‌లాంప్, యూనియన్ జాక్ థీమ్‌‌తో ఉన్న టెయిల్ లాంప్స్ మాత్రం రెగ్యులర్ కూపర్ మోడల్ తరహాలోనే ఉన్నాయి. ఫినిషింగ్ ఎలిమెంట్ కోసం డార్క్ బ్రాంజ్ యాడ్ చేశారు. బ్రాంజ్ డీటెయిలింగ్‌ని డోర్ హ్యాండిల్స్‌పై కూడా చూడొచ్చు. మినీ లోగో మాత్రం బ్లాక్ కలర్‌ ఫినిషింగ్‌తో ఉంది. ఈ కార్లను 999 యూనిట్లు మాత్రమే తయారుచేసింది కంపెనీ. అందువల్ల వీటిని ఎక్స్‌క్లూజివ్‌గా మాత్రమే అందించాలనుకుంటోంది.

ఈ కారు క్యాబిన్ కూడా కూపర్ SE తరహాలోనే ఉంది. కొత్త మోడల్‌లో ఎల్లో యాక్సెంట్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ప్రమాణాల ప్రకారం దీన్లో లెదర్ కోట్ ఉంది. స్టీరింగ్ వీల్‌కి నప్పా లెదర్ ఉంది. సీట్లపై పియానో బ్లాక్ సర్ఫెస్.. దీనికే ప్రత్యేకం. ఈ కారును కొనుక్కునేవారు ఇంటీరియర్స్ తమకు నచ్చినట్లుగా మార్పించుకునే వీలు ఉంది. యాపిల్ కార్‌ఫ్లే, ఆటో, హెడ్‌ అప్ డిస్‌ప్లే, యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, స్టాప్ అండ్ గో ఫంక్షన్ వంటివి కూడా స్టాండర్డ్ మోడల్‌కి ఉన్నట్లే ఉన్నాయి. ఈ కారులో 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టం, 5.5 – అంగుళాల MID డిస్‌ప్లే, యాపిల్ కార్‌ఫ్లే, ఆండ్రాయిడ్ ఆటో, హెడ్‌ అప్ డిస్‌ప్లే, యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, స్టాప్ అండ్ గో ఫంక్షన్ వంటివి కూడా స్టాండర్డ్ మోడల్‌కి ఉన్నట్లే ఉన్నాయి.

స్టాండర్ కారుకు ఉన్నట్లుగానే.. ఈ కారుకు కూడా 184 hp ఎలక్ట్రిక్ మోటర్ నే సెట్ చేశారు. దీనికి 32.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. స్టాండర్డ్ కారు కారు 7.3 సెకండ్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకోగా.. ఈ కారు ఆ వేగాన్ని 8.7 సెకండ్లలో అందుకుంటుంది. ఈ కారు WLTP రేట్ రేంజ్ 201 కి.మీ మాత్రమే. స్టాండర్డ్ కారు 270 కి.మీ కలిగివుంది. ఈ మినీ కూపర్ కారు ప్రారంభ ధర ఇండియాలో రూ.52.5 లక్షలు ఉంది. ఐతే.. ఇది ఇండియాలో లభించే అవకాశం కనిపించట్లేదు. ప్రస్తుతం ఈ కార్లు యూరప్ మార్కెట్లకు లభించేలా ఉన్నాయి. వీటి ఉత్పత్తి 999 మాత్రమే కాబట్టి.. వీటిని ప్రపంచవ్యాప్తంగా అమ్మే అవకాశం లేకపోవచ్చు. ఏప్రిల్ నుంచి సేల్ ఉంటుంది అంటున్నారు.మినీ కూపర్ కంపెనీ.. ఇండియాలో తన కూపర్ 3-డోర్ కారు ధరను రూ. 41.2 లక్షలుగా డిసైడ్ చెయ్యగా.. కంట్రీమాన్ కారు ధరను రూ. 47.4 లక్షలుగా నిర్ణయించింది.

Also Read:  Best Fish for Weight Loss: బరువు తగ్గడానికి ఏ చేప మంచిది?