Electric Cargo Scooter: మార్కెట్ లోకి రాబోతున్న వరల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్.. 150 కిలోమీటర్ల రేంజ్‌ తో?

ప్రస్తుత ప్రజల్లో మోటార్ సైకిళ్ల వినియోగం పెరిగిపోయింది. మరి ముఖ్యంగా వాణిజ్యపరంగా లేదా వ్యక్తిగతంగా డెలివరీలు కోసం మోటార్ సైకిళ్లపైనే ఎక్

  • Written By:
  • Updated On - February 15, 2024 / 06:37 PM IST

ప్రస్తుత ప్రజల్లో మోటార్ సైకిళ్ల వినియోగం పెరిగిపోయింది. మరి ముఖ్యంగా వాణిజ్యపరంగా లేదా వ్యక్తిగతంగా డెలివరీలు కోసం మోటార్ సైకిళ్లపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే, పెద్దమొత్తంలో లోడ్ చేయడం కుదరని పని. అది కూడా పరిమితంగానే లోడ్ చేయగలరు. లోడింగ్ ప్యాకేజీలను డెలివరీ వరకు ప్రొటెక్ట్ చేయాడం కూడా చాలా కష్టమే. ఇకపై ఇలాంటి డెలివరీ సమస్యలను పరిష్కరించేందుకు గ్లోబల్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్ వచ్చేస్తోంది. ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్గో మోటార్‌సైకిల్‌ను ప్రముఖ పూణె స్టార్టప్ కంపెనీ కార్గోస్ రూపొందించింది.

రాబోయే రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్ ప్రపంచ మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ టూవీలర్ మోటార్‌ సైకిల్ డెలివరీ సమస్యలను పరిష్కరించనుంది. తద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో లగేజీలను క్యారీ చేసేందుకు వీలు పడనుంది. ప్రస్తుతం ఈ కార్గో స్కూటర్ టెస్టింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇన్నోవేటివ్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..కార్గోస్ ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్ 6.1లిథియం-అయాన్ బ్యాటరీ ద్వారా పవర్ అందిస్తుంది. దీనిని ఫ్రెంచ్ మల్టీ నేషనల్ సాఫ్ట్‌వేర్ కార్పొరేషన్ డస్సాల్ట్ సిస్టమ్స్ సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ భారీ బ్యాటరీ 6 కిలోవాట్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేయగలదు.

అంతేకాదు.. 3.4కిలోవాట్ మోటారుతో కలిసి ఉంటుంది. ఈ కార్గో స్కూటర్ గంటకు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై 150కిలోమీటర్ల అద్భుతమైన పరిధిని అందిస్తుంది. ప్రత్యేకించి పట్టణాల్లో డెలివరీలకు అనువైనదిగా చెప్పవచ్చు. 145 కిలోల బరువు ఉన్న కార్గోస్ ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్ విశాలమైన 225-లీటర్ కార్గో కంపార్ట్‌మెంట్‌ను కలిగి ఉంది. 120 కిలోల వరకు సరుకును మోయగలదు. వాహనం ఛార్జింగ్ సామర్థ్యాలలో ప్రామాణిక ఏసీ పవర్ సాకెట్‌తో పాటు డీసీ ఛార్జింగ్ సామర్థ్యాలను అందించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు 5 గంటల 15 నిముషాల సమయం పడుతుంది.

ఇది ఛార్జింగ్ సమయాన్ని సుమారు 3 గంటల వరకు గణనీయంగా తగ్గించనుంది. కార్గోస్ ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్ కొరియర్‌లు ఒక్కో ట్రిప్‌కి రెట్టింపు ప్యాకేజీలను డెలివరీ చేసేందుకు వీలు కల్పిస్తుంది. భారీ కార్గో స్పేస్ కలిగి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ఒక్కో ట్రిప్‌కు దాదాపు 70 పార్సెల్‌లను డెలివరీ చేయగలరు. సంప్రదాయ ద్విచక్ర వాహనాలతో సగటున 35 పార్శిళ్లతో పోలిస్తే బరువైన బ్యాగ్‌లను ఇంటర్నల్ కార్గో స్పేస్ అప్ డెలివరీ గేమ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. కార్గో ఎలక్ట్రిక్ బైకు కాంపార్ట్‌మెంట్ స్పేస్‌ లాక్ చేసుకునేలా ఉంటుంది. వర్షాలు, ఎండల తీవ్రతతో పాటు దొంగతనాల బారినపడకుండా వస్తువులను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కార్గోస్ టెస్టింగ్, ధ్రువీకరణ ప్రక్రియను ఇంకా పూర్తి కాలేదు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్ కోసం బుకింగ్‌లు రాబోయే నెలల్లో ప్రారంభమవుతాయని అంచనా. ఈ కార్గో స్కూటర్ ప్రారంభ ధర రూ. 2 లక్షల నుంచి ఉండవచ్చు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 2025 నాటికి దాదాపు 12వేల యూనిట్ల ఉత్పత్తిని పెంచాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి సుమారు 250 యూనిట్లను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. ఇప్పటివరకూ కార్గోస్ ఈ ప్రాజెక్ట్‌లో 1 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టింది. ఉత్పత్తి, మార్కెటింగ్ కార్యక్రమాలకు అదనపు నిధులు అవసరమని కంపెనీ భావిస్తోంది.