ఇటీవల కాలంలో రోజురోజుకీ కార్ల వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. మధ్య తరగతి వారి నుంచి బాగా డబ్బు ఉన్న వారి వరకు ప్రతి ఒక్కరూ కార్లను ఉపయోగిస్తున్నారు. ఎవరి రేంజ్ కి తగ్గట్టుగా బడ్జెట్ కి తగ్గట్టుగా వారు కార్లను కొనుగోలు చేస్తున్నారు. కార్లలో కూడా రకాల మోడళ్లు ఉంటాయి. చాలా మంది ఈ కార్ల కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు. అయితే మామూలుగా చాలామందికి కార్లని చూసినప్పుడు ఒక సందేహం కలిగే ఉంటుంది. అదేమిటంటే ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన కార్లు ఏవి? వాటి ధర ఎంత ఉంటుంది? అవి ఎన్ని కిలోమీటర్ల మైలేజ్ ని ఇస్తాయి అన్న వివరాలు తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. మరి వాటి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Rolls Royce Boat Tail.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఈ కారు మొదటి స్థానంలో ఉంది. ఈ కారు ధర 205 కోట్ల రూపాయలు. ఇది ఖరీదైన కారు అయినప్పటికీ ఇది కేవలం చాలా పరిమిత మోడళ్లు మాత్రమే ఉంటాయి. ఈ నాలుగు సీట్ల కారు చాలా రాయల్ గా కనిపిస్తుంది. ఈ కారు 5 సెకన్లలో 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఈ కారులో అనేక ఫీచర్స్ ఉంటాయి.
Bugatti La Voiture Noire.. ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన కారు కూడా. ఈ కారు 2019లో విడుదలైంది. ఈ కారు ధర అక్షరాలా రూ.132 కోట్లు. ఈ కారును బ్లాక్ కలర్ కార్ అని కూడా పిలుస్తారు. ఈ కారు గరిష్టంగా గంటకు 420 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
Pagani Zonda HP Barchetta.. ఇది ప్రపంచంలో మూడవ అత్యంత ఖరీదైన కారు అని చెప్పాలి. దీని ధర రూ.125 కోట్లు. ఈ కారు లుక్ చాలా హెవీగా ఉంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 335 కి.మీ. ఈ కారు కేవలం 2.8 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
Rolls Royce Sweptail.. ఈ రోల్స్ రాయిస్ స్వెప్‌టైల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా చెప్పవచ్చు. దీని ధర 100 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు చాలా విలాసవంతమైనది. ఈ కారు చాలా సినిమాల్లో ఉపయోగించారు. ఈ కారును తయారు చేసేందుకు కంపెనీకి ఐదేళ్లు పట్టింది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది.
Bugatti Centodieci.. బుగట్టి సెంటోడీసీ కారు కూడా తక్కువేమీ కాదు. ఈ లగ్జరీ కారు ధర రూ. 64 కోట్లు. ఈ కారు వేగం గంటకు 420 కి.మీ వేగాన్ని అందుకుంటుందట. ఇందులో కూడా అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.