Site icon HashtagU Telugu

Most Expensive Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఏది? దాని ధర ఎంతో తెలుసా?

Most Expensive Car

Most Expensive Car

మనలో చాలామంది ఈ కార్లు అంటే పిచ్చి ఉంటుంది. అది ఎంతలా అంటే మార్కెట్లోకి ఏదైనా కొత్త కారు వచ్చింది అంటే చాలు వాటి గురించి తెలుసుకోవాలని ప్రత్యేకతలు, ధర ఇలా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక మార్కెట్ లో ఉన్న చాలా రకాల లగ్జరీ బ్రాండ్ల గురించి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఖరీదైన కార్లను లగ్జరీ బ్రాండ్ కలిగిన కార్లను ఎక్కువగా పారిశ్రామికవేత్తలు సినిమా సెలబ్రిటీలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనలో చాలామందికి ఒక సందేహం కలిగే ఉంటుంది.

అదేమిటంటే.. ప్రపంచంలో ఎన్నో రకాల కార్లు ఉన్నాయి కదా,మరి వీటిలో అత్యంత విలువైన కారు ఏది అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. మీరు కూడా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇది చదవాల్సిందే. ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కారు ధర తెలిస్తే నిజంగా నూరేళ్ల పెట్టడం ఖాయం. ఎందుకంటే ఆ కారు ధర ఒక చిన్న దేశం బడ్జెట్ అంత ఉంటుంది అని చెప్పవచ్చు. కొన్ని వేలాది గంటల పాటు శ్రమించి తయారుచేసిన ఈ కారు ధర ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఈ కారు ధర విషయంలోనే కాదు ఇతర కారణాలతో కూడా ప్రసిద్ధి చెందింది.

ఈ కారు చాలా లగ్జరీగా ఉంటుంది. అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఈ కారు ధర వెంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ కారు ధర అక్షరాలా 30 మిలియన్ డాలర్లు. అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 251 కోట్ల కంటే ఎక్కువే అని చెప్పవచ్చు. ఈ కారులో మోస్ట్ పవర్ ఫుల్ 6.75 లీటర్ ట్విన్ టర్బో ఛార్జ్డ్ వి12 ఇంజన్ ఉంది. ఇది 5250 ఆర్పీఎంతో 563 బీహెచ్‌పి, పవర్, 1500 ఆర్పీఎంతో 820 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగలదు. ఇదొక అత్యంత అందమైన, విభిన్నమైన కారు. ఈ కారు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ప్రత్యేక ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే బ్లాక్ పెయింట్ వినియోగించడం. దాంతో ఈ కారుకు విభిన్నమైన లుక్ వస్తుంది. ఈ కారు ఇంటీరియర్ చాలా క్వాలిటీ మెటీరియల్‌ తో తయారైంది. ఈ కారు పేరు ఎంత గమ్మత్తుగా ఉందో ధర అంత ఎక్కువ లగ్జరీ కార్ల మార్కెట్‌లో మరోసారి రూల్స్ రాయిస్ తన పేరు నిలబెట్టుకుంది. ఈ కారు ధర ఎంతో వెంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవడం ఖాయం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా ఈ కారు ప్రసిద్ధికెక్కింది. ఈ ఖరీదైన కారును ప్రపంచంలో కేవలం అతి కొద్ది మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు.