World Expensive Cars: ప్రతి ఒక్కరూ తమకు ఒక ఖరీదైన కారు ఉండాలని కలలు కంటారు. కానీ ఈ కార్లు చాలా ఖరీదైనవి (World Expensive Cars) కావడంతో సామాన్య ప్రజలు వీటిని సొంతం చేసుకోవడం చాలా కష్టం. దేశంలో కొద్దిమంది వ్యాపారవేత్తలు లేదా ప్రముఖులు మాత్రమే చాలా ఖరీదైన మరియు లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ప్రపంచంలోని 5 అత్యంత ఖరీదైన, ఎక్స్‌క్లూజివ్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్‌టైల్
ధర: సుమారు రూ. 250 కోట్లు
ప్రత్యేకతలు: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఇది అగ్రస్థానంలో ఉంది. దీని డిజైన్, రంగు, ఇంటీరియర్ పూర్తిగా కస్టమైజ్ చేయబడతాయి. దీని డిజైన్ “బ్లాక్ బకారా రోజ్” అనే పువ్వు నుండి ప్రేరణ పొందినట్లు చెబుతారు. ఈ కారు యజమాని ఒక బిలియనీర్ వ్యాపారవేత్త. అయితే వారి పేరును గోప్యంగా ఉంచారు.
రోల్స్ రాయిస్ బోట్ టెయిల్
ధర: సుమారు రూ. 234 కోట్లు
ప్రత్యేకతలు: ఈ కారు ఒక యాచ్ లాగా డిజైన్ చేయబడింది. దీని వెనుక భాగం ఒక చిన్న డైనింగ్ జోన్ వలె కనిపిస్తుంది. ఇందులో సన్‌షేడ్, కత్తులు-ఫోర్కులు, ఫ్రిజ్ కూడా ఏర్పాటు చేశారు. ఇది కేవలం మూడు యూనిట్లు మాత్రమే తయారు చేయబడింది. మొదటి యూనిట్‌ను జే-జెడ్ (Jay-Z), బియాన్స్ (Beyoncé) దంపతులకు ఇచ్చినట్లు భావిస్తున్నారు.
Also Read: Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ నికర విలువ ఎంతో తెలుసా?
బుగాటి లా వోయిచర్ నోయిర్
ధర: సుమారు రూ. 150 కోట్లు
ప్రత్యేకతలు: ఫ్రెంచ్‌లో ఈ పేరుకు అర్థం “నల్ల కారు” (Black Car). ఇది ఒక కస్టమ్ ప్రాజెక్ట్. ఇందులో 8.0L W16 ఇంజన్ ఉంది. దీని డిజైన్ అత్యంత ఏరోడైనమిక్‌గా ఉంటుంది. ఈ కారును కూడా ఒక వ్యక్తి కొనుగోలు చేశారుజ వారి పేరు ఇప్పటికీ రహస్యంగా ఉంది.
పగాని జోండా హెచ్‌పీ బార్చెట్టా
ధర: సుమారు రూ. 145 కోట్లు
ప్రత్యేకతలు: ఇది కూడా పరిమిత ఎడిషన్ మోడల్. ఇందులో కేవలం 3 యూనిట్లు మాత్రమే తయారు చేయబడ్డాయి. దీని బాడీ డిజైన్ వంపులు కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన కార్లలో ఒకటిగా పరిగణించబడే టాప్‌లెస్ ఓపెన్ రోడ్‌స్టర్.
బుగాటి సెంటోడియెచి
ధర: సుమారు రూ. 75 కోట్లు
ప్రత్యేకతలు: బుగాటి పాత EB110 కారుకు నివాళిగా దీనిని తయారు చేశారు. ఇది ఒక ఆధునిక హైపర్‌కార్. కేవలం 10 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయబడ్డాయి. ఇందులో 8.0 లీటర్ W16 ఇంజన్ ఉంది. ఇది కేవలం 2.4 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకోవడానికి సహాయపడుతుంది.
