Site icon HashtagU Telugu

Wonder Bike 250 : ఇదిగో వండర్ బైక్.. రూ.8కే 30 కి.మీ మైలేజీ

Wonder Bike 250

Wonder Bike 250

Wonder Bike 250 : కేవలం రూ. 8 ఖర్చుతో 30 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ-బైక్‌ రెడీ అయింది. దీన్ని అస్సాంలోని తేజ్‌పూర్‌లో ఉన్న బరికాసుబురి ప్రాంతానికి చెందిన విద్యార్థి మస్కుల్ ఖాన్ తయారు చేశాడు. దీనికి ‘వండర్​ బైక్ 250’ అని నామకరణం చేశాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో కూర్చొని ఈ-సైకిల్‌ను తయారు చేసిన ఈ కుర్రాడు.. తన వినూత్న ఆలోచనతో ఈసారి ఈ-బైక్‌తో మన ముందుకు వచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

భవిష్యత్తులో ఈ-కారును తయారు చేయాలన్నది తన లక్ష్యమని మస్కుల్ ఖాన్ అంటున్నాడు. తన క్రియేటివిటీకి తండ్రి సహకారం, ప్రోత్సాహం లభించిందని.. అందువల్లే ఈ ఆవిష్కరణలు చేయగలిగానని చెప్పాడు. ‘వండర్​ బైక్ 250’ 30 కిలోల బరువుతో దాదాపు 100 కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుందని వెల్లడించాడు.  ఈ బైక్ బ్యాటరీపై పనిచేస్తుందని.. బ్యాటరీ ఛార్జింగ్ 5 గంటల్లోనే కంప్లీట్ అవుతుందని మస్కుల్(Wonder Bike 250) తెలిపాడు.

Also Read: Revanth Reddy : కేసీఆర్ ప్రభుత్వంలోని సలహాదారులను తొలగించిన రేవంత్ సర్కార్