Site icon HashtagU Telugu

CNG ReFilling Rules: వాహనాల్లో CNG నింపేటప్పుడు ప్రయాణికులను దిగమని చెప్పడం వెనుక ఉన్న కారణం ఏంటో మీకు తెలుసా?

Mixcollage 04 Dec 2023 05 05 Pm 316

Mixcollage 04 Dec 2023 05 05 Pm 316

మామూలుగా మనం ఎప్పుడైనా వాహనాలకు CNG నింపడానికి వెళ్ళినప్పుడు వాహనంలో కూర్చున్న వ్యక్తుల సంఖ్యతో సంబంధం లేకుండా పంపు దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు వాహనం నుంచి బయటకు రావాలని చెబుతుంటారు.. అయితే అలా ఎందుకు చేస్తారు? అలా బయటికి రమ్మని చెప్పడానికి గల కారణాలు ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. మరి సిఎన్జి నింపేటప్పుడు ప్రయాణికులను ఎందుకు వాహనంలో కూర్చొనివ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఇందుకు నాలుగు కారణాలు ఉన్నాయి అంటున్నారు టెక్ నిపుణులు. ఆ నాలుగు కారణాలు ఏంటంటే.. వాహనంలో పెట్రోల్ నింపేటప్పుడు వాహనం నుంచి వ్యక్తులను దిగిపోమని అడగరు.

కానీ CNGకి అలా కోరతారు. భవిష్యత్తులో మీరు CNG ని నింపడానికి వెళ్ళినప్పుడల్లా, వాహనంలోని వారిని బయటకు రమ్మని చెప్తారు. బంక్ దగ్గర వాహనంలో CNG నింపేటప్పుడు వాహనం దిగడం అవసరం. CNG బంక్‌ల దగ్గర CNG నింపడానికి కొన్ని మార్గ దర్శకాలు ఉన్నాయి. గ్యాస్ ఫిల్లింగ్ లేదా ఓవర్ ఫిల్లింగ్ సమయంలో ట్యాంక్ లీకేజీ వల్ల పేలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదనపు భద్రత కోసం వాహనం నుంచి కిందకు దిగాలని, తద్వారా ప్రమాదం జరిగినప్పుడు, ప్రయాణికులందరూ సురక్షితంగా వాహనం నుంచి బయట ఉన్నట్లు అవుతుందని చెబుతున్నారు. సీఎన్‌జీ వాహనాలు మిగతా వాటి కంటే ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నాయి.

గ్యాస్ సిలిండర్‌లో ఏదైనా లీకేజీ జరిగితే వాహనం పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాహనం నుంచి బయటకు రావడానికి అతి పెద్ద కారణం ప్రమాద భయం. అదేవిధంగా భారతదేశంలో చాలా మంది వ్యక్తులు తమ కార్లలో బయటి మెకానిక్‌ల నుంచి సిఎన్‌జి కిట్‌లను అమర్చుకుంటారు. ఆఫ్టర్ మార్కెట్ CNG కిట్ ఉన్న వాహనాల్లో CAG ఫిల్లింగ్ నాబ్, వెనుక బూట్‌లో లేదా మధ్య సీటు కింద ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, సిఎన్‌జి ఫిల్లింగ్ నాబ్ ఎక్కడ ఉందో ప్రజలకు తెలియదు, కాబట్టి రీఫిల్లింగ్‌ లో ఎటువంటి సమస్యా తలెత్తకుండా ప్రజలు వాహనం దిగాలని కోరతారు. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే సిఎన్‌జి పంప్ మీటర్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఆ పరిస్థితిలో, మీటర్ తనిఖీ చేయడానికి వాహనం నుంచి దిగడం సరైనది. దిగడం వల్ల దాన్ని చూడటానికీ, ఎంతవరకూ నిండినదీ చూసుకోవడానికీ కూడా వీలవుతుంది. సిఎన్‌జి విషపూరితం కాదు కానీ దాని వాసన సమస్యలను కలిగిస్తుంది. వాహనాల్లో సీఎన్‌జీ లీకేజీ వల్ల తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం వంటి వాటిపై ప్రజలు ఫిర్యాదు చేస్తుంటారు. బంక్ క్యారేజ్‌లోని వాహనంలో సిఎన్‌జి నింపినప్పుడు, ప్రయాణికులను కిందకు దిగమని కోరతారు.