TATA CNG: టాట సీఎన్‌జీ కార్లు ఎందుకు భిన్నమైనవి.. అందులో ఉన్న మూడు ప్రత్యేకతలు ఇవే?

ప్రస్తుతం భారతీయ సీఎన్‌జీ మార్కెట్లో మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయిస్తోంది. కాగా మారుతి సుజుకి లో ఎన్నో రకాల సీఎన్‌జీ మోడల్స్ ఉన్న విషయం తెలి

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 03:22 PM IST

ప్రస్తుతం భారతీయ సీఎన్‌జీ మార్కెట్లో మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయిస్తోంది. కాగా మారుతి సుజుకి లో ఎన్నో రకాల సీఎన్‌జీ మోడల్స్ ఉన్న విషయం తెలిసిందే. మారుతి తర్వాత టాటా మోటార్స్, హ్యుందాయ్ నుంచి కూడా అనేక CNG మోడల్‌ లను అందుబాటులోకి వచ్చాయి. కానీ, వీటిలో టాటా మోటార్స్ సీఎన్‌జీ కార్లు కొద్దిగా భిన్నమైనవి, ప్రత్యేకమైనవి ఉన్నాయి. టాటా మోటార్స్ సీఎన్‌జీ కార్లతో మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకీ ఆ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. iCNG టెక్నాలజీ…టాటా సీఎన్‌జీ కార్లలో ఐసీఎన్‌జీ సాంకేతికత అందించబడుతుంది. ఇందులో నేరుగా సిఎన్‌జి మోడ్‌ లో కారును స్టార్ట్ చేసుకునే సదుపాయం ఉంది. ఇది ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్.

అయితే ఈ ఫీచర్ ఏ ఇతర కంపెనీల సీఎన్‌జీ కార్లలో అందుబాటులో లేదు. ఇతర వాటిలో కారు మొదట పెట్రోల్‌తో ప్రారంభమవుతుంది. తరువాత సీఎన్‌జీ మోడ్‌కు మారుతుంది. దీని కారణంగా పెట్రోల్ కూడా వృధా అవుతుంది. కానీ టాటా సీఎన్‌జీ కార్లలో ఇలాంటి సిస్టమ్‌ లేదు. ట్విన్-సిలిండర్ టెక్నాలజీ.. కాగా ప్రస్తుతం టాటా సీఎన్‌జీ కార్లలో ట్విన్ సిలిండర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కంపెనీ ఈ టెక్నాలజీని ఆటో ఎక్స్‌పో 2023 లో ప్రదర్శించింది. ఇప్పుడు దీనిని తన సీఎన్‌జీ కార్లలో అందిస్తోంది. ట్విన్ సిలిండర్ టెక్నాలజీ, బూట్ స్పేస్ అందించడంలో సహాయపడుతుంది. నిజానికి ఒక పెద్ద సీఎన్‌జీ సిలిండర్ స్థానంలో, రెండు చిన్న సీఎన్‌జీ సిలిండర్లు అందించడం జరిగింది.

సీఎన్‌జీతో AMT గేర్‌బాక్స్.. ఇటీవల టాటా మోటార్స్ దాని సీఎన్‌జీ మోడల్స్ టియాగో, టిగోర్‌ లలో ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌ ను జోడించింది. దీనితో ఇది భారతదేశంలో ఏఎంటీ గేర్‌బాక్స్‌తో వచ్చిన మొదటి సీఎన్‌జీ కారుగా అవతరించింది. అయితే హ్యుందాయ్, మారుతి సీఎన్‌జీ కార్లు మాన్యువల్ గేర్‌బాక్స్‌ను మాత్రమే అందిస్తాయి. అంటే మీకు సీఎన్‌జీతో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కావాలంటే టాటా మోటార్స్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి.