Engine Oil In Winter: ఈ సీజన్‌లో క్రమంగా చలి పెరుగుతోంది. ఉదయం, రాత్రి సమయంలో వాతావరణ ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో ఉదయం ఏదైనా వాహనాన్ని స్టార్ట్ చేయడంలో ఇబ్బంది వస్తోంది. కానీ ప్రజలు తమ వాహనాలను సమయానికి సర్వీసింగ్ చేయించకపోవడం ముఖ్య కారణంగా తెలుస్తోంది. అలాగే ఇంజిన్ ఆయిల్ (Engine Oil In Winter) సమయానికి మార్చకపోవటంతో వాహనంలో సమస్యలు వస్తుంటాయి. మీరు మీ వాహనాన్ని ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవాలనుకుంటే ఆయిల్‌ని ఎన్ని కిలోమీటర్ల తర్వాత టాప్-అప్ చేయాలి లేదా మార్చాలి అని ఇక్కడ మేము మీకు చెప్పబోతున్నాం.
ఇంజిన్ ఆయిల్ పని
ఇంజిన్ ఆయిల్‌ను నిరంతరం ఉపయోగించడంతో దాని ‘లూబ్రికేట్స, ‘క్లీన్’ సామర్థ్యం వేగంగా తగ్గిపోతుంది. ఇంజిన్ సాధారణంగా పనిచేయడం అసాధ్యం. అనేక సందర్భాల్లో ఇంజిన్ సమస్యలు వచ్చే అవకాశం తరువాత భారీ నష్టం జరుగుతుంది.
టాప్ అప్ లేదా ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు మార్చాలి?
కారులో అయితే ప్రతి 5,000 నుండి 6,000 కిలోమీటర్ల తర్వాత వాహనంలోని ఇంజిన్ ఆయిల్‌ను మార్చాలి. ఇలా చేయడం వల్ల ఇంజిన్ లైఫ్ పెరగడమే కాకుండా పనితీరు కూడా నిరంతరం మెరుగుపడుతుంది. అయితే శీతాకాలంలో కూడా మీరు ఇంజిన్ ఆయిల్‌ను సమయానికి మార్చవలసి ఉంటుంది. మీ కారు నగరంలో రోజూ 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవ్ చేస్తే మీరు సర్వీస్‌తో పాటు ఇంజిన్ ఆయిల్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి.
Also Read: CJI Sanjiv Khanna: సీఈసీ, ఈసీల ఎంపిక వ్యవహారం.. విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ
సమస్యలు రావొచ్చు
సమయానికి ఇంజన్ ఆయిల్ మార్చుకోకపోతే ఇంజన్ బాగా పాడైపోతుందని నిపుణులు అంటున్నారు. ఇంధన వినియోగం పెరగడం ప్రారంభమవుతుంది. ఓవర్ హీట్ సమస్యలు మొదలవుతాయి. శబ్దం స్థాయి పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇంజిన్ పూర్తిగా విఫలం కావచ్చు. దీని వల్ల మీరు చాలా నష్టపోవచ్చు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏదైనా వాహనంలో ఇంజిన్ ఆయిల్‌ను సమయానికి మార్చడం చాలా ముఖ్యం. ఇంజిన్ ఆయిల్ పరిమాణం తక్కువగా ఉన్నట్లు, నల్లగా మారినట్లయితే ఇంజిన్ ఆయిల్ జోడించండి లేదా టాప్-అప్ పొందండి. ప్రస్తుతం మార్కెట్లోకి వివిధ ఇంజన్ ఆయిల్‌లు రావడం ప్రారంభించాయి. ఇవి మంచి పనితీరును అందిస్తాయని పేర్కొన్నప్పటికీ మీరు కంపెనీ సిఫార్సు చేసిన ఇంజిన్ ఆయిల్‌ను మాత్రమే ఉపయోగించాలి.
శీతాకాలంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఇంజిన్ ఆయిల్ మందంగా మారుతుంది. దీని కారణంగా అది సులభంగా ప్రసరించదు. ఇటువంటి పరిస్థితిలో మీరు మీ వాహనంలో వింటర్-గ్రేడ్ ఇంజిన్ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఈ ఇంజిన్ ఆయిల్ చల్లని వాతావరణంలో ద్రవంగా ఉంటుంది. తక్కువ, అధిక ఉష్ణోగ్రతలలో ప్రభావవంతంగా ఉండే మల్టీగ్రేడ్ ఆయిల్‌ను (5W-30 వంటివి) ఎంచుకోండి.