Site icon HashtagU Telugu

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా అగ్ని ప్రమాదానికి గురవ్వడానికి ప్రధాన కారణాలు ఇవే?

Mixcollage 01 Feb 2024 03 30 Pm 2117

Mixcollage 01 Feb 2024 03 30 Pm 2117

రోజురోజుకీ ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా పర్యావరణానికి ఎటువంటి హాని లేకపోవడంతో ప్రభుత్వాలు కూడా వీటికి బాగా సపోర్ట్ చేస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో చాలా మంది ఈవీలను కొంటున్నారు. కానీ కొన్ని వాహనాలు అగ్నిప్రమాదాలు గురవడం అన్నది ప్రస్తుతం ఆందోళనను కలిగిస్తోంది. అయితే సాధారణంగా వేసవి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లు అగ్నిప్రమాదాలకు గురవుతుంటాయి.

బ్యాటరీ నుంచి మంటలు చెలరేగి చూస్తండగానే వాహనం మొత్తం కాలిపోతుంది. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏదైనా ఎలక్ట్రిక్ వాహనంలో మంటలకు అధిక వేడి ప్రధాన కారణం. ఎలక్ట్రిక్ వాహనంలోని విడిభాగాలు వేడెక్కితే వాటిలో మంటలు చెలరేగే ప్రమాదం పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగిన అనేక సందర్భాల్లో బ్యాటరీలు, విడిభాగాలు వేడెక్కినట్లు గుర్తించారు. బ్యాటరీలో లోపం లేదా వైరింగ్, వెల్డింగ్‌లో లోపం కారణంగా బ్యాటరీ వేడెక్కుతుంది. వేడి వాతావరణం కారణంగా బ్యాటరీ కూడా వేడెక్కుతుంది.

అలాంటి సందర్భాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా అగ్నిప్రమాదానికి గురవుతుంటాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లలో అగ్నిప్రమాదానికి తయారీ లోపం మరో ప్రధాన కారణం. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉండే బ్యాటరీ అనేక రకాల రసాయన భాగాలతో తయారవుతుంది. బ్యాటరీని ప్యాక్ చేసేటప్పుడు ఏదైనా లోపం ఉన్నా బ్యాటరీ డ్యామేజ్ అయినా కూడా మంటలు చెలరేగవచ్చు. కాగా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఉష్ణోగ్రతను బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ నియంత్రిస్తుంది. ఒకవేళ బిఎంఎస్ బ్యాటరీ టెంపరేచర్‌ని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతే. స్కూటర్ కొంతసేపు నడిచిన వెంటనే బ్యాటరీ వేడెక్కడం మొదలవుతుంది. ఈ కారణంగా ఎలక్ట్రిక్ వాహనంలో షార్ట్ సర్క్యూట్ల ఏర్పడి మంటలు చెలరేగుతాయి.