Site icon HashtagU Telugu

Volkswagen: ఫోక్స్ వ్యాగన్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఛార్జ్తో అన్ని కి. మీ ప్రయాణం?

Mixcollage 22 Mar 2024 04 16 Pm 2045

Mixcollage 22 Mar 2024 04 16 Pm 2045

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారత్ లో తన మొదటి ఎలక్ట్రిక్ కారును ఐడి.4 పేరుతో విడుదల చేయబోతోంది. అయితే ఇప్పటికే ఈ కారు దేశంలోకి ప్రవేశించింది. ఇక ఈ కార్ ధర ఈ ఏడాది చివర్లో ప్రకటించబడుతుంది. మరి ఈ కారుకు సంబందించిన డిజైన్, ఫీచర్లు, బ్యాటరీ ప్యాక్, రేంజ్ గురించి తెలుసుకుందాం.. ఫోక్స్‌ వ్యాగన్ ID.4 డిజైన్ గురించి చెప్పాలంటే ఇది VM లోగోతో కూడిన స్టైలిష్ గ్రిల్, కూల్ బానెట్, ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లు, 21-అంగుళాల అల్లాయ్ వీల్స్, 3డీ క్లస్టర్ డిజైన్, స్కిడ్ ప్లేట్‌లను కలిగి ఉంది.

అలాగే ఎలక్ట్రిక్ కారులో పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అనేక కనెక్టివిటీ ఆప్షన్‌లతో కూడిన 10 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ ఉన్నాయి. వోక్స్‌వ్యాగన్ ID 4 ఈవీ డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 82 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఎలక్ట్రిక్ కారు 500 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. కొత్త ఫోక్స్‌వ్యాగన్ కారు పవర్‌ట్రెయిన్ సెటప్ 299 hp శక్తిని, 499 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కారు గరిష్ట వేగం గంటకు 180 కి.మీ. ఈ ఎలక్ట్రిక్‌ కారు కేవలం 6 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకోగలదు. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సింగిల్ మోటర్, రియర్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లతో సహా అనేక పవర్‌ట్రైన్ ఎంపికలలో వస్తుంది. ప్రస్తుతం వోక్స్‌వ్యాగన్ ID.4 ధరలను ప్రకటించలేదు.

Exit mobile version