Video Viral: ఏం టెక్నాలజీ గురు.. డ్రైవర్ లేకుండానే నడుస్తున్న టాక్సీ?

మాములుగా ఏదైనా వాహనం నడపాలి అంటే డ్రైవర్ కచ్చితంగా ఉండాల్సిందే. కారు వంటి వాహనాలను డ్రైవ్ చేయడానికి అయినా ఎవరో ఒక మనిషి ఉండాల్సిందే. కానీ డ

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 07:07 PM IST

మాములుగా ఏదైనా వాహనం నడపాలి అంటే డ్రైవర్ కచ్చితంగా ఉండాల్సిందే. కారు వంటి వాహనాలను డ్రైవ్ చేయడానికి అయినా ఎవరో ఒక మనిషి ఉండాల్సిందే. కానీ డ్రైవర్ లేకుండా నడిచే ఆటోమేటిక్ టాక్సీ లో కూర్చోవడం అంటే నిజంగా ఒక సాహసం అని చెప్పవచ్చు. డ్రైవర్ లేకుండా కారు ముందుకు మూవ్ అవుతూ వెళ్లడం అన్నది నిజంగా సూపర్ టెక్నాలజీని అని చెప్పవచ్చు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలోని బీజింగ్‌లో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మీరు సెల్ఫ్ డ్రైవింగ్ కారును చూడవచ్చు. అక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ కారు బుక్ చేసుకుంటే ఆ కారు మీ లొకేషన్ కి వస్తుంది.

ఆ కార్ మిమ్మల్ని సురక్షితంగా మీ గమ్యస్థానానికి చేరుస్తుంది. ఆ వీడియోలో డ్రైవరు లేని టాక్సీ రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తి వద్దకు వస్తుంది. ఆ వ్యక్తి టాక్సీ డోర్ వద్ద స్క్రీన్‌పై ఏదో టైప్ చేస్తాడు. ఇలా చేయడం వల్ల కారు డోర్ తెరుచుకుంటుంది. అప్పుడు ఆ వ్యక్తి తన కుటుంబంతో కలిసి కారులో కూర్చుంటాడు. డ్రైవర్ లేకుండా కార్ స్టార్ట్ అయ్యి కదలడం ప్రారంభిస్తుంది. కారులో అమర్చిన డిస్‌ప్లేలో కారు పరిసరాల 3డి మ్యాప్ కూడా మీకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో పాటు పలు సోషల్ నెట్‌వర్క్‌లలో చర్చనీయాంశమైంది.చాలామంది ఆ వీడియోని చూసి అద్భుతం అని కామెంట్స్ చేస్తుండగా కొంతమంది ఏం టెక్నాలజీ గురు. అదిరిపోయిందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

సెల్ఫ్ డ్రైవింగ్ కారుని డ్రైవర్‌లెస్ కార్ అని కూడా అంటారు. కాగా సెల్ఫ్-ఆపరేటేడ్ కార్లు అధిక రిజల్యూషన్‌లో చూడటానికి కెమెరా టెక్నాలజీ ఉపయోగించబడుతుంది. రోడ్డు సంకేతాలు ఇంకా గుర్తులను చదవడానికి ఈ కెమెరాలు ఉపయోగించబడతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల చుట్టూ వివిధ లెన్స్‌లు అమర్చబడి ఉంటాయి. టెస్లా గతంలో సెమీ ఆటోమేటిక్ కారును ఉత్పత్తి చేసింది. ఆటోపైలట్ సాఫ్ట్‌వేర్ ఇటీవల అప్‌డేట్ చేయబడింది. ఇంకా టెస్లా పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ కారు ధరను మరోసారి పెంచింది. ఈ కారు ధర 15,000 డాలర్లు. కొన్ని నెలల క్రితం దీని ధర $10,000 నుండి $12,000 వరకు పెంచింది.