Site icon HashtagU Telugu

EV Scooter: ఈవీ స్కూటర్ పై భారీగా తగ్గింపు.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్!

Mixcollage 04 Mar 2024 07 41 Pm 7004

Mixcollage 04 Mar 2024 07 41 Pm 7004

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌ పై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే అందులో భాగంగానే విడా పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా తాజాగా కొత్తగా విడా వి1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.15 లక్షలు. వి1 ప్రోతో పోలిస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 30 వేలు తక్కువకు లభిస్తోంది. దేశంలో ఇది ఓలా, ఏథర్, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్ లతో పోటీ పడుతోంది. హీరో విడా వి1 ప్లస్‌ కంటే ముందు ఓలా ఎస్1 ఎయిర్, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ అర్బనే లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే మార్కెట్‌ లో తమ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

విడా V1 ప్లస్.. 3.4kWh బ్యాటరీ ప్యాక్, 100 కి.మీ రేంజ్, 5.1 గంటలలో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ సమయం, రూ.97,800 ఎక్స్-షోరూమ్ ధరగా ఉంది. ఓలా S1 ఎయిర్.. 3kWh బ్యాటరీ ప్యాక్, 151 కి.మీ రేంజ్, 5 గంటలలో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ సమయం, రూ.1,04,999 ఎక్స్-షోరూమ్ ధరగా ఉంది. టీవీఎస్ ఐక్యూబ్.. 3kWh బ్యాటరీ ప్యాక్, 100 కి.మీ రేంజ్, 4.3 గంటలలో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ సమయం, రూ.1,17,422 ఎక్స్-షోరూమ్ ధర గా ఉంది.

బజాజ్ చేతక్ అర్బనే.. 2.9kWh బ్యాటరీ ప్యాక్, 113 కి.మీ రేంజ్, 4.5 గంటలలో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ సమయం, రూ.1,15,001 ఎక్స్-షోరూమ్ ధరగా ఉంది. హీరో మోటోకార్ప్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 100 కి.మీ సింగిల్ ఛార్జ్ రేంజ్‌తో వస్తోంది. ఇది ఫుల్ ఛార్జ్‌కి 5 గంటల 15 నిమిషాలు పడుతుంది. అలాగే మిడిల్ క్లాస్ జనాలకు ఈ స్కూటర్ వారి బడ్జెట్‌లోనే అందుబాటులో ఉంటుంది.