Road Tax: దేశంలో ఎలక్ట్రిక్ కార్లతో పాటు హైబ్రిడ్ కార్ల విక్రయం కూడా ఊపందుకుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాబోయే కొన్నేళ్లలో హైబ్రిడ్ కార్లు ఊపందుకుంటాయని తెలుస్తోంది. కార్ల కంపెనీలు కూడా హైబ్రిడ్ కార్లపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించేందుకు టయోటా ఇన్నోవా హైక్రాస్, హైరైడర్, క్యామ్రీ హైబ్రిడ్ కార్లపై ఉత్తరప్రదేశ్‌లో రూ.4.40 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. మీరు కూడా ఈ ఆఫర్‌ను ఎలా ఉపయోగించుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
హైబ్రిడ్ కార్లపై రూ.4.40 లక్షల వరకు ఆదా అవుతుంది
టయోటా స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలపై మాత్రమే 100% రోడ్డు పన్ను (Road Tax) మినహాయింపు ఉంటుంది. మీరు ఉత్తరప్రదేశ్‌లోని ఎస్పిరిట్ టయోటా నుండి టయోటా స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలను (ఇన్నోవా హైక్రాస్, హేరైడర్, క్యామ్రీ) కొనుగోలు చేస్తే మీకు 100% రోడ్డు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇటీవల ప్రభుత్వం కూడా విద్యుదీకరణకు పెద్దపీట వేసింది. హైబ్రిడ్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. RTO పన్ను మినహాయింపు ప్రయోజనం వినియోగదారులకు సరిగ్గా అందిస్తే భవిష్యత్తులో ఇది పెద్ద మార్కెట్ అవుతుందని యూపీ సర్కార్ భావిస్తోంది.
Also Read: Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో బైక్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
దేనిపై ఎంత తగ్గింపు?
మీడియా నివేదికల ప్రకారం.. టయోటా క్యామ్రీపై రూ. 4.40 లక్షల వరకు ఆదా అవుతుంది. ఇది లగ్జరీ సెడాన్ కారు. హైరైడర్‌లో మీరు రూ. 2 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని పొందుతారు. ఇది కాకుండా మీరు Hycrossపై రూ. 3.10 లక్షల వరకు పూర్తి తగ్గింపును పొందవచ్చు. హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించేందుకు మాత్రమే ఇంత పెద్ద రాయితీ ఇస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
టయోటా క్యామ్రీ హైబ్రిడ్ ధర రూ.46.17 లక్షలు కాగా, ఇన్నోవా హైక్రాస్ ధర రూ.25.97 లక్షలు. ఇది కాకుండా హైరైడర్ ధర రూ.16.66 లక్షలు. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్త ప్రోత్సాహకం ఇతర రాష్ట్రాలకు కూడా స్ఫూర్తినిస్తుంది.
ఈ హ్యుందాయ్ SUVపై రూ. 85,000 తగ్గింపు
జూలై నెలలో హ్యుందాయ్ తన 6, 7 సీటర్ అల్కాజర్‌పై రూ. 85,000 తగ్గింపును అందిస్తోంది. ఇది ప్రీమియం SUV. ఇందులో రెండు ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అల్కాజర్‌ను హ్యుందాయ్ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించింది. ఈ తగ్గింపు జూలై 31 వరకు వర్తిస్తుంది. ఇది కాకుండా హ్యుందాయ్ ఈ నెలలో సెడాన్ కారు వెర్నాపై రూ.35,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ కారులో రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయ్ ఐ20 CVT వేరియంట్‌పై రూ. 30,000 వరకు తగ్గింపును అందిస్తోంది. హ్యుందాయ్ ఆరా CNG వేరియంట్‌పై రూ. 43,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది.