TVS Jupiter: మార్కెట్ లోకి రాబోతున్న టీవీఎస్ అప్డేటెడ్ స్కూటర్.. లంచ్ అయ్యేది అప్పుడే!

వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీవీఎస్ అప్డేటెడ్ స్కూటర్ లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది.

Published By: HashtagU Telugu Desk
TVS Jupiter 110

TVS Jupiter 110

ఇటీవల కాలంలో భారత దేశంలో స్కూటర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. వాహన వినియోగదారులు కూడా ఎక్కువ శాతం మంది స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇక భారత్‌ లో పెరిగిన డిమాండ్‌ కు అనుగుణంగా కంపెనీలు కూడా కొత్త స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్‌ హవా పెరగడంతో ప్రముఖ కంపెనీలు మాత్రం ఉన్న మోడల్స్‌కే సరికొత్త అప్‌డేట్స్‌ ను ఇస్తున్నాయి. అందులో బాగం గానే తాజాగా ప్రముఖ కంపెనీ టీవీఎస్ ఆగస్టు 22 న స్కూటర్ అప్‌డేట్‌ ఇస్తామని తెలిపింది.

కానీ ఏ మోడల్ స్కూటర్ అప్డేట్ ఇస్తారు అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు టీవీఎస్ సంస్థ. కానీ రాబోయే అప్డేటెడ్ టీవీఎస్ జూపిటర్ గురించి అయ్యి ఉండవచ్చు అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి త్వరలో లాంచ్ కాబోతున్న ఆ టీవీఎస్ స్కూటర్ అప్డేట్ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ వచ్చే వారంలో ఆసక్తికర అప్‌డేట్‌ తో మన ముందుకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే టీవీఎస్ జూపిటర్ 110 సీసీ ఇంజిన్‌ తో వస్తుంది. అయితే ఈ స్కూటర్ ఇప్పటికే మార్కెట్‌ లో అందుబాటులో ఉన్నప్పటికీ చాలా ఏళ్లుగా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. టీవీఎస్ స్కూటర్ అమ్మకాల్లో జూపిటర్ అగ్రభాగాన నిలుస్తున్నా కూడా ఇటీవల కాలంలో మాత్రం అమ్మకాల్లో కాస్త వెనుకబడిందని చెప్పాలి.

ఈ నేపథ్యంలో ఈ స్కూటర్‌ ను అప్‌డేట్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డిజైన్‌ తో పాటు ఫీచర్ల పరంగా అప్‌డేట్ చేస్తారని అంచనా వేస్తున్నారు. ఎల్ఈడీ డీఆర్ఎల్‌ తో ఎల్ఈడీ లైటింగ్, మరింత స్టైలిష్ ప్యానెల్స్, మెరుగైన అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ కన్సోల్, టర్న్ బై టర్న్ వంటి ఫీచర్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే టీవీఎస్ జూపిటర్ 125 వెర్షన్ విషయానికి వస్తే.. అండ్ సీట్ స్పేస్ అప్‌డేట్‌ తో పాటు ఇతర ఫీచర్లతో అప్‌డేట్ చేస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగస్ట్ 22న వచ్చే కొత్త జూపిటర్ 110 కాదా? అని టీవీఎస్ ఇంకా ధ్రువీకరించలేదు. అయితే లాంచ్‌ కు ముందే అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలు అందించే అవకాశం ఉంది. కాగా ఈ టీవీఎస్ జూపిటర్ 110 ధర రూ.77,000 నుంచి ప్రారంభమవుతుంది.

  Last Updated: 18 Aug 2024, 03:20 PM IST