TVS Ronin 225 India launch : టీవీఎస్ రోనిన్ స్క్రాంబ్లర్ వస్తోంది.. ధర లక్షన్నర!

స్క్రాంబ్లర్, క్రూయిజర్ కలయికతో రూపొందించిన ఓ కొత్త మోటార్‌ సైకిల్ ను టీవీఎస్ మోటార్ జులై 6న విడుదల చేసింది.

  • Written By:
  • Publish Date - July 6, 2022 / 06:00 PM IST

స్క్రాంబ్లర్, క్రూయిజర్ కలయికతో రూపొందించిన ఓ కొత్త మోటార్‌ సైకిల్ ను టీవీఎస్ మోటార్ జులై 6న విడుదల చేసింది. దాని పేరు “టీవీఎస్ రోనిన్” (TVS Ronin). టీవీఎస్ కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్ లో దీని టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ లో ” టి ” ఆకారపు గుర్తు కనిపిస్తుంది. దానిలోపల లాంగ్ రైడ్ లను సూచించే రోడ్ ఫొటో ఉంటుంది. దీన్నిబట్టి.. రాబోయేది కచ్చితంగా ఓ క్రూయిజర్ లేదా స్క్రాంబ్లర్ స్టైల్ మోటార్‌సైకిల్ అనే అంచనాలకు బలమిస్తోంది. దీని ధర సుమారు రూ. 1.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) రేంజ్ లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలను కంపెనీ జులై 6న ప్రకటించనుంది.

“టీవీఎస్ రోనిన్” ఫీచర్స్..

* ఈ మోటార్‌సైకిల్ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
* ఈ మోటార్‌ సైకిల్‌లో 225సీసీ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.
* మోటార్‌సైకిల్ లోని ఇంజన్ అవుట్‌పుట్ విషయానికి వస్తే.. ఇది గరిష్టంగా 20 బీహెచ్‌పీ శక్తిని అందించగలదు.
* మోటార్‌సైకిల్ లో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
* టీవీఎస్ రోనిన్ ముందు భాగంలో గోల్డ్ ఫినిష్డ్ ఇన్వర్టెడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, అల్లాయ్ వీల్స్, మందపాటి టైర్లు, పూర్తి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌ లు ఉంటాయి.
* బ్రౌన్ కలర్ సీట్ చంకీ ఎగ్జాస్ట్ క్యానిస్టర్‌లు, ముందు మరియు వెనుక డిస్క్ బ్రేక్‌లు, డ్యూయెల్ ఏబీఎస్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

“టీవీఎస్ రోనిన్” మోటార్‌సైకిల్ లో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండే అవకాశం ఉంది.టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ (TVS SmartXonnect) టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది. బ్లూ టూత్ టెక్నాలజీ ద్వారా రైడర్ యొక్క స్మార్ట్ ఫోన్ ను బైక్ తో కెనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది.

2018 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించి..

టీవీఎస్ తొలిసారిగా ఈ బైక్ ను కాన్సెప్ట్ రూపంలో 2018 ఆటో ఎక్స్‌పో లో ప్రదర్శించింది. అయితే, కాన్సెప్ట్ వెర్షన్ కి , ప్రొడక్షన్ వెర్షన్ కి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు కాన్సెప్ట్‌లో లిక్విడ్-కూల్డ్ ఇంజన్, స్పోక్ వీల్స్, ఫుల్ బ్లోన్ టెయిల్‌పీస్ ఉన్నాయి. కానీ ప్రొడక్షన్ వెర్షన్ టీవీఎస్ రోనిన్ లో ఇవి కనిపించవు.