Site icon HashtagU Telugu

TVS New Bike: కేవలం రూ. 60 వేలకే టీవీఎస్ బైక్.. అదెలా అంటే!

Tvs New Bike

Tvs New Bike

ఇటీవల భారతదేశంలో ద్విచక్ర వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. పెట్రోల్ డీజిల్ వాహనాలతో పాటు ఈవీ వాహనాలను కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు వినియోగదారులు. మరి ముఖ్యంగా 110 సీసీ సెగ్మెంట్‌ మోటార్ సైకిళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. టీవీఎస్ ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ ఈ సెగ్మెంట్‌లోని హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ సిటీ 110ఎక్స్, హోండా సిడి 110 డ్రీమ్ బైకులకు మంచి పోటీనిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ టీవీఎస్ సంస్థ మరో కొత్త అప్డేట్ కలిగిన మోటార్ సైకిల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.

అయితే తాజాగా విడుదల చేసిన ఆ టీవీఎస్ బైక్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. TVS Radeon ఆల్ బ్లాక్ ఎడిషన్‌ ను లాంచ్ చేసింది టీవీఎస్. అయితే ప్రస్తుతం డిమాండ్‌తో 110సీసీ సెగ్మెంట్‌లో దూసుకుపోతున్న టీవీఎస్ రేడియన్ ఇప్పుడు కొత్త రంగుతో విడుదలైంది. కంపెనీ కొత్త ఆల్ బ్లాక్ కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. TVS Radeon ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు రంగులలో అందుబాటులో ఉంది. బేస్, డిజిడ్రమ్, డిజి డిస్క్ అనే మూడు వేరియంట్‌ లలో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంది. టీవీఎస్ Radeon మరింత తక్కువ ధరలో అందించేందుకు బేస్ వేరియంట్ ధర కూడా తగ్గించారు.

Radeon ఇప్పుడు రూ.59,880 తో వస్తోంది. రూ.2,525 ధర తగ్గింపుతో మిడ్ స్పెక్ డిజి డ్రమ్ వేరియంట్ ధర రూ.77,394 గా ఉంది. అయితే టాప్ స్పెక్ డిజి డిస్క్ రూ.81,394 కి అందుబాటులో ఉంది. కలర్ LCD స్క్రీన్, USB ఛార్జింగ్ పోర్ట్ కూడా వస్తుంది. ఈ బైక్ డ్రమ్ వేరియంట్ బరువు 113 కిలోలు, డిస్క్ వేరియంట్ బరువు 115 కిలోలుగా ఉంటుంది. రెండు బ్రేక్‌లను ఏకకాలంలో యాక్టివేట్ చేసే కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అందిస్తారు. కాగా ఈ టీవీఎస్ Radeon 10 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. 109.7సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో 8పీఎస్ పవర్, 8.7 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 68 కి.మీ మైలేజీని కూడా ఇస్తుందని కంపెనీ తెలిపింది. దీని డ్రమ్ వేరియంట్ 130mm ఫ్రంట్ డ్రమ్ బ్రేక్‌తో వస్తుంది. డిస్క్ వేరియంట్‌ లో ముందు 240mm డిస్క్ ఉంది. రెండు వెర్షన్లు 110 mm వెనుక డ్రమ్ బ్రేక్‌తో అమర్చబడి ఉంటాయి. ఇది టెలిస్కోపిక్ ఫోర్క్, ప్రీలోడ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్‌ లను కూడా కలిగి ఉంది.