TVS Jupiter 125: సరసమైన ధరకే అద్భుతమైన మైలేజీని అందిస్తున్న స్కూటీ?

ఇటీవల కాలంలో ద్విచక్ర వాహన వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతూనే ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో కనీసం రెండు బైకులు అయినా ఉపయోగిస్తున్నారు. పెద్దపెద్ద ఫ్యామిలీలో ఉద్యోగం చేసేవారు అయితే ఎవరికి వారు సొంతంగా స్కూటర్లను బైకులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో పురుషులు కూడా స్కూటర్ల మీదే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకు అనుగుణంగానే మార్కెట్లోకి

  • Written By:
  • Publish Date - July 4, 2024 / 08:46 PM IST

ఇటీవల కాలంలో ద్విచక్ర వాహన వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతూనే ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో కనీసం రెండు బైకులు అయినా ఉపయోగిస్తున్నారు. పెద్దపెద్ద ఫ్యామిలీలో ఉద్యోగం చేసేవారు అయితే ఎవరికి వారు సొంతంగా స్కూటర్లను బైకులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో పురుషులు కూడా స్కూటర్ల మీదే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకు అనుగుణంగానే మార్కెట్లోకి కొత్త కొత్త స్కూటర్లు విడుదల అవుతూనే ఉన్నాయి. ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే మీరు కూడా కొత్త స్కూర్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా.

అయితే టీవీఎస్ జుపిటర్ 125 బెస్ట్ ఛాయిస్ గా చెప్పవచ్చు. ఈ స్కూటర్ సరసమైన ధరలో లభిస్తుంది. గరిష్ట మైలేజీని కూడా అందిస్తుంది. ఈ టీవీఎస్ ​​జుపిటర్ 125 స్కూటర్ చాలా సరసమైన ధరలో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.89,155 నుండి రూ.99,805 గా ఉంది. డ్రమ్, డిస్క్, SmartXonnect వేరియంట్‌ లలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ 124.8 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ తో 8.2 PS గరిష్ట శక్తిని, 10.5 Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 50 kmpl వరకు మైలేజీని కూడా అందిస్తుంది.

టీవీఎస్ జుపిటర్ 125 స్కూటర్ LED హెడ్‌ ల్యాంప్, LED టెయిల్ ల్యాంప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, USB ఛార్జింగ్ సాకెట్‌ తో పాటు పలు ఫీచర్ లను కూడా అందిస్తోంది. హెల్మెట్ లు, ల్యాప్‌ టాప్‌ లు వంటి వస్తువులను సులభంగా తీసుకెళ్లడానికి 33 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ కూడా ఉంది. కాగా ఈ స్కూటర్‌ లో భద్రత కోసం డిస్క్, డ్రమ్ బ్రేక్ ఎంపికలు కూడా ఉన్నాయి. ముందు, వెనుక 12 అంగుళాల అల్లాయ్ వీల్స్, 90/90 12 కొలత గల ట్యూబ్‌లెస్ టైర్‌ లతో ఇవి ఉంటాయి. ఇది 108 కిలోల బరువు, 5.1 లీటర్ కెపాసిటి గల ఇంధన ట్యాంక్ ను కూడా కలిగి ఉంది. ఇకపోతే ప్రస్తుతం మార్కెట్ లో టీవీఎస్ జుపిటర్ 125 స్కూటర్‌ కు హోండా డియో అతిపెద్ద ప్రత్యర్థి అని చెప్పవచ్చు. దీని ధర రూ.74,629 నుంచి రూ.82,130 గా ఉంది. ఇది 7.85 PS పవర్, 9.03 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 109.51 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 50 kmpl వరకు మైలేజీని ఇస్తుంది. 103 కిలోల బరువున్న ఈ స్కూటర్‌లో 5.3 లీటర్ కెపాసిటి గల ఇంధన ట్యాంక్ ఉంది.