TVS X EV : ఒక్కసారి చార్జింగ్ పెడితే 140 కి.మీ ప్రయాణం.. టి.వి.ఎస్ ఎలక్ట్రిక్ బైక్ గురించి ఇది తెలుసా..!

ఈవీ విభాగంలో టీ.వి.ఎస్ (TVS) నుంచి రెండో మోడల్ గా దుబాయ్ లో లాంచ్ చేశారు.ప్రీమియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా టీ.వి.ఎస్ ఎక్స్ పేరుతో ఈ స్కూటర్ వస్తుంది.

  • Written By:
  • Updated On - September 16, 2023 / 09:23 PM IST

TVS X EV : పెట్రోల్, డీజిల్ వాహనాలకు బై బై చెప్పి ఇప్పుడు వాహన దారులంగా కూడా ఎలెక్ట్రిక్ బైక్, కార్ల మీద ఆసక్తి చూపిస్తున్నారు. రోజుకొక రేటు మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను భరించలేక వాటి బదులుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే బెటర్ అని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ బైకులకు ఇండియాలో అధిక డిమాండ్ పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ప్రత్యేక రాయితీ అందిస్తుండటం తో ప్రజలు వాటిని కొనేందుకు మరింత ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక మార్కెట్ లో ఉన్న అన్ని కంపెనీలు పెట్రోల్, డీజిల్ తో పాటుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఫోర్ వీలర్ లోనే కాదు టూ వీలర్ లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ హడావిడి ఎక్కువైంది. ఇందులో భాగంగా ప్రముఖ ద్విచక్ర వహన తయారీ సంస్థ టీ.వీ.ఎస్ మోటార్ సరికొత్త ఎలెక్ట్రిక్ స్కూటర్ ని తీసుకొచ్చింది. ఈవీ విభాగంలో టీ.వి.ఎస్ (TVS) నుంచి రెండో మోడల్ గా దుబాయ్ లో లాంచ్ చేశారు. ప్రీమియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా టీ.వి.ఎస్ ఎక్స్ (TVS X) పేరుతో ఈ స్కూటర్ వస్తుంది. నేవిగేషన్ సిస్టెం, ఈవీ చార్జింగ్ మ్యాపింగ్ మెకానిజం, లైవ్ లొకేషన్ షేరింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఈవీ వస్తుంది.

టీ.వి.ఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ 3.8 కిలో వాటర్ బ్యాటరీ సామర్ధ్యం తో వస్తుంది. అంటే ఒక్కసారి చార్జింగ్ పెడితే దాదాపు 140 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. 2.6 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటున్న ఈ ఈవీ తో గరిష్టంగా 105 కీ.మీ వేగంతో ప్రయాణించవచ్చు. 11 కిలో వాట్ మోటార్ పీక్ పవర్ తో ఎక్స్ టెల్త్, ఎక్స్ ట్రైడ్, ఎక్స్ ఓనిక్ అనే 3 మోడ్స్ లో ఈ వెహికల్ వస్తుంది.

గంటలో 50 శాతం చార్జింగ్ ఎక్కే ఈ వెహికల్ 3 గంటల 40 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ ఎక్కుతుంది. ఈ వెహికల్ ఎక్స్ షో రూ ప్రైజ్ 2,49,990 రూపాయలుగా కంపెనీ ప్రకటించింది. వెహికల్ కావాలి అనుకున్న వారు 5 వేలతో టీ.వీ.ఎస్ అధికారిక వెబ్ సైట్ లో రిజర్వ్ చేసుకోవచ్చు.

Also Read:  Tata Salt : టాటా సాల్ట్ అలా మొదలైందా..! వేస్ట్ అనుకున్నది సూపర్ ప్రాఫిట్స్ తెచ్చాయా..!