TVS : రెట్రో లుక్ తో టీవీఎస్ కొత్త బైక్…రోనిన్..!!

జావా, యెజ్డీ, రాయల్ ఎన్ ఫీల్డ్ వంటి రెట్రో బైక్ లకు ఇప్పటికీ కూడా ప్రజాదరణ తగ్గలేదు. ఈ మోటార్ సైకిళ్లు పెద్దగా మైలేజీ ఇవ్వకపోయినా...వాటిపై ఠీవిగా కూర్చుని ప్రయాణం చేయాలని చాలామందికి ఆశ ఉంటుంది.

  • Written By:
  • Publish Date - July 11, 2022 / 08:00 AM IST

జావా, యెజ్డీ, రాయల్ ఎన్ ఫీల్డ్ వంటి రెట్రో బైక్ లకు ఇప్పటికీ కూడా ప్రజాదరణ తగ్గలేదు. ఈ మోటార్ సైకిళ్లు పెద్దగా మైలేజీ ఇవ్వకపోయినా…వాటిపై ఠీవిగా కూర్చుని ప్రయాణం చేయాలని చాలామందికి ఆశ ఉంటుంది. ఈ రెట్రో బైక్ లు రోడ్డుపై వెళ్తుంటే…అందరి చూపు ఆకర్షిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా రెట్రో సెగ్మెంట్లోకి దేశీయ ద్విచక్రవాహన తయారీ దిగ్గజం టీవీఎస్ కూడా అడుపెట్టింది. రోనిన్ పేరుతో టీవీఎస్ కొత్త మోటార్ సైకిల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది కొంచెంద క్రూయిజర్ బైక్ లాగే ఉంటుంది. అయితే సింగింల్ ఇన్ స్ట్రుమెంట్ పోడ్, హేవీ ఆయిల్ ట్యాంక్, వైడ్ హ్యాండిల్ బార్ రెట్రో లుక్ ను అందిస్తున్నాయి.

ఈ సెగ్మెంట్ల ఇతర బైకులతో పోల్చితే..రోనిన్ చాలా తేలికగా ఉంటుంది. దీని బరువు 160 కేజీలు. దీని ధర కూడా అందుబాటులోనే ఉంది. టీవీఎస్ ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు. కాగా గరిష్టధర రూ. 1.70లక్షలు. ఇందులో 225 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ వాల్వ్ ఇంజిన్ను అమర్చారు. ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కలిగి ఉంటుంది. రోనిన్ ట్యాంక్ కెపాసిటి 14 లీటర్లు ఉంది.

ఇక టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ద్వారా బ్లూటూత్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఇన్ కమింగ్ కాల్ అలెర్ట్స్, మెసేజ్ అలెర్ట్ వాయిస్ కమాండ్ సిస్టమ్స్ ఇందులో ఉన్నాయి. రెట్రో సెగ్మెంట్లో ఇది రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా హైనస్, హోండా సీబీ 350 ఆర్ఎస్, జావా 42లకు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. బైక్ లతో పోల్చితే రోనిన్ ధర తక్కువగా ఉండటం, డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉండటంతో యువత దీనిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి.