TVS Classic: టీవీఎస్‌ జూపిటర్‌లో క్లాసిక్‌ వెర్షన్‌.. ధర, ఫీచర్లు ఇవే?

ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌  తమ జూపిటర్‌ స్కూటర్‌ లో పలు మోడల్స్ ని ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూడా ఒక సరికొత్త జూపిటర్‌ స్కూటర్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. జూపిటర్‌ క్లాసిక్‌

  • Written By:
  • Publish Date - September 24, 2022 / 09:12 AM IST

ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌  తమ జూపిటర్‌ స్కూటర్‌ లో పలు మోడల్స్ ని ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా కూడా ఒక సరికొత్త జూపిటర్‌ స్కూటర్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. జూపిటర్‌ క్లాసిక్‌ పేరుతో దీన్ని నేడు మార్కెట్‌లోకి విడుదల చేసింది టీవీఎస్ సంస్థ. ఇక దీని ధర విషయానికి వస్తే..రూ.85,866 ఎక్స్‌షోరూం ధర. కాగా టీవీఎస్ జూపిటర్‌ స్కూటర్ల విక్రయాలు 50 లక్షలు పూర్తి అయిన సందర్భంగా ఈ కొత్త వేరియంట్‌ను త కంపెనీ తెలిపింది.
ఈ జూపిటర్‌ డిజైన్‌లో కొన్ని మెరుగులు దిద్ది క్లాసిక్‌ ఎడిషన్‌ ను కూడా తీసుకొచ్చినప్పటికీ మెకానికల్‌గా మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది 109.77 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో వస్తోంది. అలాగే 8.4 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ వద్ద 7.47 పీఎస్‌ శక్తిని విడుదల చేస్తుంది. అదేవిదంగా ఫెండర్‌ గార్నిష్‌కు బ్లాక్‌ థీమ్‌, 3డీ లోగో, హ్యాండిల్‌బార్స్‌,మిర్రర్‌ హైలైట్స్‌ డిజైన్‌ పరంగా చేసిన మార్పుల్లో చేశారట.
 ఇక డైమండ్‌ కట్‌ అలాయ్‌ వీల్స్‌ స్కూటర్‌కు ఒక  క్లాసిక్‌ లుక్‌ను తీసుకొస్తున్నాయి. కాగా ఇందులో వెనక కూర్చునే వారికి కూడా ఇప్పుడు బ్యాక్‌ రెస్ట్‌ సపోర్ట్‌ రానుంది. ఇక ఈ జూపిటర్ క్లాసిక్ మిస్టిక్‌ గ్రే, రీగల్‌ పర్పుల్‌ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. అలాగే ఆల్ ఇన్‌ వన్‌ లాక్‌, ఇంజిన్‌ కిల్‌ స్విచ్‌, యూఎస్‌బీ ఛార్జర్‌ అదనపు ఫీచర్లు.