TVS Apache: టీవీఎస్ అపాచీ నుంచి సరికొత్త మోడల్స్.. ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పటికే ఎన్నో రకాల టీవీఎస్ ద్విచక్ర వాహనాలను

Published By: HashtagU Telugu Desk
Tvs Apache

Tvs Apache

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పటికే ఎన్నో రకాల టీవీఎస్ ద్విచక్ర వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితో పాటుగా ఎప్పటికప్పుడు మార్కెట్లోకి సరికొత్త మోడల్స్ ని తీసుకువస్తోంది టీవీఎస్ కంపెనీ. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఒకదానిని మించి మరొకటి అద్భుతమైన ఫీచర్లతో మైలేజ్ ఇచ్చే వాటిని మార్కెట్లో విడుదల చేస్తున్నారు.

కాగా ఇప్పటికే పలు రకాల మోడల్స్ మార్కెట్ లోకి రాగా తాజాగా మరొక రెండు సరికొత్త మోడల్స్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ బైక్స్ ఏమిటి దాని ధర ఎంత అన్న విషయానికి వస్తే… టీవీఎస్ కంపెనీ కొత్తగా రెండు అపాచీ మోడల్స్ ను లాంచ్ చేసింది. అపాచీ ఆర్టిఆర్ 160,ఆర్టిఆర్ 180 మోడల్స్ నీ తీసుకువచ్చింది. అపాచీ ఆర్టిఆర్160 ధర విషయానికి వస్తే.. దీని ధర రూ 1.18లక్షలు. అపాచీ ఆర్ టి ఆర్ 180 ధర విషయానికి వస్తే దీని ధర రూ.1.31 లక్షలు.

ఇక ఫీచర్ లు SmartXonnect buletooth కనెక్టివిటీ, LED హెడ్ ల్యాంప్, టైల్ ల్యాంప్, అలాగే కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్. కాగా పల్సర్ N 160, హీరో Xtreme 160R కు పోటీగా వీటిని తీసుకువచ్చినట్టుగా సమాచారం.

  Last Updated: 09 Sep 2022, 01:39 AM IST