Site icon HashtagU Telugu

Bike: తక్కువ ధరకే ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఈ ఐదు రకాల బైక్స్.. ఈ లిస్ట్ లో టాప్ లో ఆ బైక్!

Mixcollage 18 Feb 2024 05 36 Pm 3873

Mixcollage 18 Feb 2024 05 36 Pm 3873

ప్రస్తుత రోజుల్లో బైకుల వాడకం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో ఎక్కువ శాతం మంది బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ బైకులు ట్రాఫిక్ లో చిన్న చిన్న సందుల్లో పోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉండడంతో వీటినే ఎక్కువ శాతం మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో పెట్రోల్, ఎలక్ట్రిక్ అన్ని రకాల బైక్‌ల ధరలు పెరుగుతున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది బైకుల ధరలు మండిపోతుండడంతో వాటిని కొనుగోలు చేయాలి అంటేనే భయపడుతున్నారు.

తక్కువ ధరకే అధిక మైలేజ్ ఇచ్చే బండ్లు ఏవో తెలియక చాలామంది ఆలోచిస్తూ ఉంటారు.. మరి తక్కువ ధరకే ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఆ బైక్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హోండా షైన్ SP 125,124 cc ఇంజన్ సామర్థ్యంతో వస్తున్న, ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కి 60 కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. మీరు ఈ బైక్‌ను సుమారు లక్షకు పొందుతారు. ఈ బైక్ లో టీచర్లు కూడా అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే బజాజ్ పల్సర్ 125.. 124 సిసి ఇంజన్‌తో నడిచే ఈ బైక్ మైలేజ్ దాదాపు 50 కిలోమీటర్లు. డిస్క్ బ్రేకులు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ బైక్‌ని లక్షలోపు పొందవచ్చు. లక్ష లోపు లభించే మరొక బైక్ బజాజ్ ప్లాటినా 100.. 102 సిసి ఇంజన్ కెపాసిటీ ఉన్న ఈ బైక్‌ను మైలేజ్ రారాజు అని పిలుస్తూ ఉంటారు.

ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌తో 70 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్ ధర 90 వేల వరకు ధర తగ్గుతుంది. టీవీఎస్ రైడర్ 125..125 సీసీ ఇంజన్ కెపాసిటీ ఉన్న ఈ బైక్ ధర ఒక లక్ష కంటే కొంచెం ఎక్కువ, అయితే ఈ బైక్ లాంచ్ అయిన వెంటనే బాగా పాపులర్ అయ్యింది. ఒక లీటర్ పెట్రోల్ 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. హీరో Xtreme 125R.. ఇటీవల కొత్తగా విడుదల చేసిన ఈ 125 సిసి బైక్ ఇప్పటికే కొత్త తరంలో దాని రూపానికి, డిజైన్‌కు ప్రజాదరణ పొందింది. ధర లక్ష కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నా, బైక్ కొనాలనే ఉత్సాహం నింపుతుంది.

Exit mobile version