Site icon HashtagU Telugu

Defog car windows: చలికాలంలో కారు ప్రయాణం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఇవి మీ వెంట ఉండాల్సిందే!

Defog Car Windows

Defog Car Windows

చలికాలంలో చాలామంది వెకేషన్ లకు వెళ్లాలని ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా వెకేషన్ లకు ఎక్కువ శాతం కారులో ప్రయాణించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే చలికాలంలో మంచు కారణంగా కారు విండో స్క్రీన్ పై అలాగే సైడ్ అద్దాలపై కూడా మంచు పేరుకుపోతూ ఉంటుంది. ఈ మంచు కారణంగా కొన్ని కొన్ని సార్లు రోడ్డు స్పష్టంగా కనిపించగా డ్రైవింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో పాటు కొన్ని కొన్ని సార్లు యాక్సిడెంట్లు కూడా అవుతూ ఉంటాయి.

అందుకే చాలామంది ఈ మంచు వాతావరణంలో ఉన్నప్పుడు ప్రయాణించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇటువంటి సమయంలో డిఫాగర్లు బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు టెక్ నిపుణులు. పొగమంచు విపరీతంగా కమ్ముకున్న సమయంలో కార్లలో ప్రయాణం చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా కారులో వాతావరణం వెచ్చగా ఉంటుంది. బయటేమో చలిగా మారుతుంది. దీంతో కారు కిటికీల ఉపరితలంపై మంచు ఏర్పడుతుంది. ఇది మీ డ్రైవింగ్ సామర్థ్యానికి పరీక్ష పెడుతుంది. కారు అద్దాలపై ఏర్పడిన మంచు బిందువులను తొలగించడానికి డీఫాగర్లు ఎంతో ఉపయోగపడతాయని చెబుతున్నారు.

ఇవి కారులోని ఒక రకమైన పరికరాలు. ముందు వెనుక విండ్ స్క్రీన్ లతో పాటు సైడ్ అద్దాలను శుభ్రం చేయడానికి వీటిని ఏర్పాటు చేశారు. శీతాకాలం, వర్షాకాలాలలో ఢీ ఫాగర్ల వినియోగం ఉంటుంది. కారు ముందు, వెనుక అద్దాల నుంచి రోడ్డును స్పష్టంగా చూడటానికి ఇవి చాలా అవసరం. కారులోని ముందు, వెనుక భాగాలలో ఢీఫాగర్లు ఉంటాయి. కారుకు ముందు భాగంలో ఉండే విండ్ షీల్డ్ పై మంచు బిందువులు పేరుకుపోతే డ్రైవింగ్ అస్సలు చేయలేము. వాటిని తొలగించడానికి కారులోని హీటింగ్ వెంటిలేషన్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ సిస్టమ్ ను ఆన్ చేయగానే విండ్ షీల్డ్ బేస్ లోని వెంట్ లకు వెచ్చిన గాలి వెళుతుంది. ఇది అద్దం ఉపరితలమంతా వ్యాపిస్తుంది. దీంతో పొగమంచు తొలగిపోతుంది. వెనుక విండ్ షీల్డ్ ఫాగర్ హెచ్ వీఏసీ సిస్టమ్ తో పనిచేయదు.

అయితే దీన్ని వేడి చేయడానికి విద్యుత్ ను ఉపయోగించాలి. దానిలోని సన్నని గ్రిడ్ లకు విద్యుత్ వెళ్లడంతో వేడెక్కుతాయి. దీంతో విండ్ షీల్డ్ పై పేరుకుపోయిన మంచు కరిగిపోతుంది. మరికొన్ని పద్ధతుల ద్వారా కారు అద్దాలపై పొగమంచు, తేమను తొలగించవచ్చు. కారులో సిలికాజెల్ గుళికలను ఉంచుకోవచ్చు. ఇవి తేమను తొలగించడానికి ఉపయోగపడతాయి. అలాగే విండ్ షీల్డ్ పై షేవింగ్ ఫోమ్ ను స్ప్రే చేయాలి. పొడి టవల్ తో దాని తుడిస్తే అద్దం మెరిసిపోతుంది. వెనిగర్ లేదా డిష్ సోప్ తో నీటిని కలిపి అద్దాలపై చల్లాలి. దాన్ని మొత్తటి గుడ్డతో తుడిచినా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.