Site icon HashtagU Telugu

Creta Electric: అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్న కెట్రా ఎలక్ట్రిక్ కార్.. సింగిల్ చార్జ్ తో ఏకంగా అన్ని కి.మీ ప్రయాణం!

Creta Electric

Creta Electric

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోయిన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనాలు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కూడా పెరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటికే చాలా రకాల కంపెనీలో మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ కంపెనీ నుంచి క్రెటా ఎలక్ట్రిక్ అనే కారు విడుదల అయ్యింది.

ఢిల్లీలో జరిగిన భారత్ మోబిలిట్ గ్లోబల్ ఎక్స్ పో 2025లో క్రెటా ఎలక్ట్రిక్ కారును హ్యుందాయ్ విడుదల చేసింది. 42 కేడబ్ల్యూహెచ్, 51.4 కేడబ్ల్యూహెచ్ అనే రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కారును పూర్తిగా 42 కేడబ్ల్యూహెచ్ తో చార్జ్ చేస్తే 390 కిలో మీటర్లు ప్రయాణిస్తుందట. అలాగే 51.4 కేడబ్ల్యూహెచ్ మోడల్ కారులో 473 కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చట. 11 కేబ్ల్యూ ఏసీ చార్జర్ తో 4 నుంచి 4.30 గంటల్లోపు బ్యాటరీలను చార్జింగ్ చేసుకోవచ్చు. అదే 50 కేడబ్ల్యూ డీసీ ఫాస్ చార్జర్ తో గంటలో పది నుంచి 80 శాతం, 100 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ చార్జర్ తో 39 నిమిషాల్లో చార్జింగ్ అవుతుందట.

ఈ కారు మనకు హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, స్మార్ట్ (O), ప్రీమియం, ఎక్సలెన్స్ లాంగ్ రేంజ్ వంటి ఐదు రకాల వేరియంట్ లలో లభిస్తుందట. వీటిలో స్మార్ట్ (o), ప్రీమియం, ఎక్సలెన్స్ లాంగ్ రేంజ్ వేరియంట్లను ఎంచుకున్న ఖాతాదారులు 11 కేడబ్ల్యూ కనెక్ట్ చేయబడిన వాల్ బాక్స్ చార్జర్ ను ఇన్ స్టాలేషన్ తో సహా రూ.73 వేలకు పొందవచ్చట. వేరియంట్ల వారీగా ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఎగ్జిక్యూటివ్ 42 కేడబ్ల్యూహెచ్ రూ.17.99 లక్షలుగా ఉంది. స్మార్ట్ 42 కేడబ్ల్యూహెచ్ రూ.18.99 లక్షలు కాగా, స్మార్ట్ o 42 కేడబ్ల్యూహెచ్ రూ.19.49 లక్షలుగా ఉంది. ఇక ప్రీమియం 42 కేడబ్ల్యూహెచ్ రూ. 19.99 లక్షలుగా ఉంది. స్మార్ట్ o 51.4 కేడబ్ల్యూహెచ్ రూ.21.49 లక్షలు కాగా, ఎక్సలెన్స్ లాంగ్ రేంజ్ 51.4 కేడబ్ల్యూహెచ్ రూ.23.49 లక్షలుగా ఉంది.