Site icon HashtagU Telugu

Toyota: టయోటా నుంచి సీఎన్‌జీ వేరియంట్లు .. బుకింగ్స్ ఎప్పటి నుంచో తెలుసా?

Toyota Kirloskar

Toyota

ఆటోమొబైల్ వాహన తయారీ దిగ్గజం టయోటా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల వాహనాలను అత్యధిక ఫీచర్లతో మార్కెట్ లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు టయోటో కంపెనీ వినోగదారులకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలతో మంచి మంచి అద్భుతమైన స్పెసిఫికేషన్ లతో వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ తాజాగా సీఎన్‌జీ విభాగంలోకి ప్రవేశించింది.

గ్లాంజా, అర్బన్‌ క్రూజర్‌ హైరైడర్‌ మోడళ్ల లో సీఎన్‌జీ వేరియంట్ లను పరిచయం చేసింది. కాగా గ్లాంజా మోడల్ ధర రూ.8.43 లక్షల నుంచి మొదలుకానుంది. అర్బన్‌ క్రూజర్‌ హైరైడర్‌ మోడల్ ధరను మాత్రం ప్రకటించలేదు. కాగా బ్రాండ్ ప్రీమియం అయిన హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా ఆన్‌లైన్ బుకింగ్‌లను కూడా అప్పుడే ప్రారంభించింది. రూ. 11 వేలు చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. గ్లాంజా ఎస్‌ ట్రిమ్‌కు రూ. 8.43 లక్షలు, జీ ట్రిమ్‌కి రూ. 9.46 లక్షల ఎక్స్-షోరూమ్, ఢిల్లీ మధ్య ధరలను నిర్ణయించింది.

పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే, గ్లాంజా సీఎన్‌జీ ధర రూ. 95,000 ఎక్కువగా ఉంది. ఇకపోతే టయోటా పరిచయం చేసిన ఈ గ్లాంజా ఫీచర్ల విషయానికి వస్తే.. 55 లీటర్ సీఎన్‌జీ ట్యాంక్‌ను అమర్చింది. అలాగే ఇంటీరియర్ లో కూడ ఎటువంటి మార్పులు లేవు. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, 7.0 అంగుళాల టచ్‌ స్క్రీన్, వాయిస్ అసిస్టెంట్, OTA అప్‌ డేట్‌లతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్, స్టార్ట్ స్టాప్ బటన్ , ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లాంటి ఫీచర్ఉ ఇందులో ఉన్నాయి. ఇటీవల లాంచ్‌ చేసిన బాలెనో సీఎన్‌జీతో ఇది పోటీ పడనుందని అంచనా వేస్తున్నారు.